లేటెస్ట్

నెల్లూరు కలెక్టర్‌ ‘శేషగిరిబాబు’ బదిలీ

నెల్లూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వి.శేషగిరిబాబును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఎపిట్రాన్స్‌కో ఎండిగా ఉన్న ‘చక్రధర్‌బాబు’ను జిల్లా కలెక్టర్‌గా నియమించింది. ఎం.వి.శేషగిరిబాబుకు ఎటువంటి పోస్టింగ్‌ ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచింది. చాలా కాలంగా ‘శేషగిరిబాబు’ను బదిలీ చేస్తారని వార్తలు వస్తున్నా..అవి నిజం కాలేదు. నెల్లూరు జిల్లాలో నెల‌కొన్న రాజకీయ పరిస్థితుల‌ను ‘శేషగిరిబాబు’ జీర్ణించుకోలేకపోతున్నారనే మాట ఆయా వర్గాల‌ నుంచి వినిపిస్తోంది. ఆయనే తనను బదిలీ చేయాల‌ని కోరుతున్నారని వార్తలు వచ్చాయి. తాను రాజకీయ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని తనను బదిలీ చేయాని కోరినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆయన సెల‌వుపై వెళ్లారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంక్షేమ పథకాల‌ అములో రాజకీయ ఇబ్బందులు రావడం, అధికారపార్టీ నాయకు లు ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునే క్రమంలో ఆయనపై తీవ్రమైన ఒత్తిడి తేవ‌డం, ఇతర సమస్యలు రావ‌డంతో తనను ఇక్కడ నుంచి బదిలీ చేయమని ఆయన కోరడానికి కారణమని తెలుస్తోంది. కాగా ‘కరోనా’ సమయంలో ఆయనను బదిలీ చేయరని కొంత మంది ఆశించినా...శేషగిరిబాబు తీవ్రస్థాయిలో ప్రభుత్వ పెద్దల‌పై తనను బదిలీ చేయాల‌ని ఒత్తిడి తెచ్చారని దాంతో ఆయనను బదిలీ చేశారని అంటున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు జిల్లా కలెక్టర్లను నియమించగా...గత ప్రభుత్వ హయాంలో కొందరు నియమితులై ఇంకా కొనసాగుతున్నారు. ఇటువంటి వారిలో ఒకరిద్దరని బదిలీ చేయాల‌ని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట. మొత్తం మీద ఒకే సారి ఐదుగురు లేదా..అంత కన్నా ఎక్కువ మంది కలెక్టర్లను బదిలీ చేయాల‌ని ప్రభుత్వం ఆలోచిస్తుందని, అయితే రోజు రోజుకు రాష్ట్రంలో ‘కరోనా’ విజృంభిస్తుండడంతో..ఆ ప్రతిపాదనను పక్కన పెట్టారని తెలుస్తోంది.

(472)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ