లేటెస్ట్

అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్‌

కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డకు చెందిన షేక్‌ బాబా పకృధ్దీన్‌ అను వ్యక్తి అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గత కొంత కాలంగా ప్రభుత్వం మద్యం రేట్లు అధికంగా పెంచటంతో బాబా పకృద్దీన్ తెలంగాణ నుండి అక్రమంగా మద్యం తరలించి ఆళ్ళగడ్డలో విక్రయిస్తున్నట్లు ఆళ్ళగడ్డ టౌన్‌ సిఐ సుబ్రమణ్యం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో నిర్వ‌హించిన విలేఖరుల‌ సమావేశంలో తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అందిన సమాచారం మేరకు ఆళ్ళగడ్డ పట్టణం సమీపంలోని పివియస్‌ఆర్‌ గోడౌన్‌ దగ్గర అహోబిలం రోడ్డులో బాబా పకృద్దీన్‌ తన ద్విచక్రవాహనంలో మద్యం బాటిళ్ళను తరలిస్తుండగా సిఐ సుబ్రమణ్యం, యస్‌ఐ రామిరెడ్డి తమ సిబ్బందితో వెళ్లి పట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఒక ద్విచక్రవాహనం,మరియు సుమారు రూ.40,000/- లు విలువ చేసే మద్యం బాటిళ్ళను స్వాదీనం చేనుకొని కేసు దర్యాప్తు చేస్తున్నామ‌ని ఆయన తెలిపారు. 


(146)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ