లేటెస్ట్

‘రమణదీక్షితులు’ వర్సెస్‌ ‘సుబ్బారెడ్డి’...!

తిరుమల‌ తిరుపతి దేవస్థానంలో మళ్లీ ఆదిపత్యపోరు మొదలైంది. తిరుమల‌ వెంకన్న గౌరవ ప్రధాన అర్చకులు ‘రమణదీక్షితుల‌’కు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిల‌కు మధ్య దర్శనాల‌ విషయంలో బహిరంగంగానే వాదన ప్రతివాదల‌ను సాగుతున్నాయి. కరోనా మహమ్మారి రాష్ట్ర వ్యాప్తంగా చెల‌రేగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భక్తుల‌ను ‘శ్రీవారి’ దర్శనానికి అనుమతించడం సరికాదని, భక్తుల‌కు ‘కరోనా’ సోకే ప్రమాదం ఉందని, ఇప్పటికే పలువురు అర్చకుల‌కు, సిబ్బందికి కరోనా సోకిందని అందు వ‌ల్ల‌ దర్శనాల‌ను ఆపాల‌ని ‘రమణదీక్షితులు’ కోరుతున్నారు. అయితే తిరుమల‌ వచ్చే భక్తుల‌కు ఎవరికీ ‘కరోనా’ సోకలేదని, దర్శనాల‌ను నిలిపివేయాల్సిన అవసరం లేదని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు. అయితే తాను చెప్పినట్లు దర్శనాలు ఆపివేయకపోవడంతో ‘రమణదీక్షితులు’ సిఎం జగన్మోహన్‌రెడ్డి ఉద్దేశిస్తూ టీటీడీ గతంలో ‘చంద్రబాబు’ పాల‌నలో ఎలా ఉందో ఇప్పుడూ అదే విధంగా ఉందని ఏమీ మారలేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచనం సృష్టిస్తున్నాయి. అంతే కాదు..ఆయన మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు, సుబ్రహ్మణ్యస్వామి తదితరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ట్వీట్లను రీట్వట్‌ చేస్తూ తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. మాట తప్పం..మడమ తిప్పం అనేది ప్రజల‌ను మభ్య పెట్టడానికేనని ఐవైఆర్‌ కృష్ణారావు చేసిన ట్వీట్‌ల‌ను ‘రమణదీక్షితులు’ రీట్వీట్‌ చేశారు. కాగా ‘రమణదీక్షితుల‌’ వ్యవహారశైలిపై టీటీడీ ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దర్శనాల‌పై సామాజిక మాధ్యమాల్లో చర్చలేవనెత్తడం సరికాదని ఆయన హితవు పలికారు. ‘రమణదీక్షితుల‌’తో మాట్లాడాని ఆయన అధికారుల‌ను ఆదేశించారు. కాగా ఈ ఇద్దరు ఎవరికి వారు పట్టుదల‌తో వ్యవహరిస్తున్నారు. ఒకరేమో దర్శనాల‌ను ఆపేది లేదని అంటుండగా..మరొకరేమో..ఆపి తీరాల‌ని డిమాండ్‌ చేస్తున్నారు. మొత్తం మీద ఈవ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుంటేనే సమస్య ఒక దారికి వస్తుందనే అభిప్రాయం టిటిడి ఉద్యోగుల్లో ఉంది.

(283)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ