లేటెస్ట్

పాత్రికేయుల‌కు ‘లోకేష్‌’ బీమా...!

‘కరోనా’తో మృతి చెందితే రూ.10ల‌క్షలు
ప్రమాదావశాత్తు మరణిస్తే రూ.20ల‌క్షలు చెల్లింపు...!

మహమ్మారి ‘కరోనా’ పాత్రికేయ లోకాన్ని కమ్మేస్తున్నా కేంద్ర, రాష్ట్ర పాల‌కులు చోద్యం చూస్తున్న పరిస్థితుల్లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్  ఓ అడుగు ముందుకేసి వారికి బీమా ధీమా కల్పించారు. గత ఎన్నికల్లో తాను పోటీ చేసి ఓడిపోయిన ‘మంగళగిరి’ నియోజకవర్గ పరిధిలోని 62 మంది జర్నలిస్టుల‌కు ఆయన స్వంతంగా బీమా చేయించారు. ‘కరోనా’ సమయంలో పాత్రికేయులు మరణించడంపై ఆయన స్పందిస్తూ తన వంతుగా పలువురు జర్నలిస్టుల‌కు సహాయం చేశారు. తన నియోజకవర్గంలోని మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాలో పనిచేస్తోన్న ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టుందరికీ ఇన్సూరెన్స్‌ చేయించారు. ఇన్సూరెన్స్‌ పత్రాల‌ను ఆయా జర్నలిస్టుకు త్వరలో అందజేయనున్నారు. జూలై 15 నుంచి అమలులోకి వచ్చిన జర్నలిస్టు బీమాతో ఏదైనా జరగకూడదని జరిగితే వారి కుటుంబాల‌కు ధీమా కల్పించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బీమా పొందిన జర్నలిస్టుల్లో ఎవరైనా సహజ మరణం  లేదా కరోనా వ‌ల్ల‌ చనిపోతే వారికి నామినీకి రూ.10ల‌క్షలు ప్రమాదంలో చనిపోతే రూ.20ల‌క్షలు చెల్లించేలా పాల‌సీల‌ను చేయించారు. కోవిద్‌-19 వైరస్‌ మహమ్మారి అల‌జడి రేపుతున్న పరిస్థితుల్లో వైరస్‌ కట్టడికి ముందుండి పోరాడుతున్న వైద్య, పారిశుధ్య, అత్యవసర సర్వీసులు అందిస్తున్న వారందరూ కరోనా కాటుకు గురవుతున్నారు. వారితో పాటు తమ ప్రాణాల‌ను పణంగా పెట్టి కరోనా వార్తలు అందిస్తూ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టు ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా భావించి వారికి ఇన్సూరెన్స్‌ చేయించానని ‘లోకేష్‌’ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ‌ల్ల‌ మృతి చెందిన జర్నలిస్టుందరికీ ప్రభుత్వం రూ.50ల‌క్షల‌ పరిహారం ఇచ్చి వారి కుటుంబాల‌ను ఆదుకోవాని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టులు విధి నిర్వహణలో చాలా అప్రమత్తంగా ఉండాని సూచించారు. కేంద్ర, రాష్ట్ర పాల‌కుల‌కు జర్నలిస్టులు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోని పరిస్థితుల్లో ఇప్పుడు ‘నారా లోకేష్‌’ స్పందించి తన నియోజకవర్గ జర్నలిస్టుకైనా బీమా చేయించడంపై హర్షం వ్యక్తం అవుతోంది. ‘మంగళగిరి’ జర్నలిస్టుల‌ను ఆదుకున్నట్లే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుకు టిడిపి ఇదే విధంగా ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ చేయించి ఆదుకోవాల‌ని పలువురు జ‌ర్న‌లిస్టులు కోరుతున్నారు.

(519)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ