‘గోదావరి’ దారి...టిడిపి కూటమి వైపే...!
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత చేసిన ఓ సర్వేలో ‘గోదావరి’ జిల్లాల్లో కూటమి గాలి వీస్తోన్నట్లు స్పష్టం చేసింది. ‘గోదావరి’ జిల్లాలైన ‘తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి’ జిల్లాలు ఏ రాజకీయ పార్టీవైపు మొగ్గితే..వారిదే రాష్ట్రంలో అధికారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో ‘వైకాపా’ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉంటే..వైకాపా 27 స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించింది. వాస్తవానికి ‘గోదావరి’ జిల్లాల్లో ‘టిడిపి’ హవా ఉంటుంది. కానీ గత ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరగడంతో..ఇక్కడ ‘వైకాపా’ సునాయాసంగా అధికస్థానాలు సాధించగలిగింది. అయితే ఈసారి మాత్రం ఫలితాలు..రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు మరో 56 రోజులు మాత్రమే సమయం ఉండగా వచ్చిన ఓ సర్వేలో ‘టిడిపి, జనసేన, బిజెపి కూటమి 20 స్థానాల్లో గెలవబోతోందని, ‘వైకాపా’ కేవలం 5 స్థానాలకే పరిమితం అవుతుందని, మరో 9 స్థానాల్లో హోరాహోరి పోరు ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటికే కూటమి తరుపున అభ్యర్థులను ప్రకటించగా, అధికార వైకాపా కూడా తన అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం, ఎటువంటి మార్పులు జరగకుండా వీరే అభ్యర్థులు అయితే..ఈ ఫలితాలు ఉంటాయని తెలిపింది. ఒక వేళ అభ్యర్థులను మార్పులు చేర్పులు జరిగితే..ఫలితాల్లో తేడా ఉండవచ్చిని ఆ సర్వే సంస్థ తెలియజేసింది.
క్ర.స నియోజకవర్గం అభ్యర్ధులు విజేత అంచనా
1) రంపచోడవరం (ఎస్టీ) మిర్యాల శ్రీదేవి (టిడిపి) -నాగులపల్లి ధనలక్ష్మి (వైకాపా) వైకాపా
2) తుని యనమల దివ్య (టిడిపి) - దాడిశెట్టి రాజా (వైకాపా) వైకాపా
3) పత్తిపాడు సత్యప్రభ (టిడిపి) - పరుపుల సుబ్బారావు (వైకాపా) టిడిపి కూటమి
4) పీఠాపురం పవన్‌కళ్యాణ్ (జనసేన) - వంగాగీత (వైకాపా) టిడిపి కూటమి
5) కాకినాడ రూరల్ పంతం నానాజీ (జనసేన) - కురసాల కన్నబాబు (వైకాపా) టైట్‌ఫైట్
6) పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప (టిడిపి) - దావులూరి దొరబాబు (వైకాపా) టిడిపి కూటమి
7) కాకినాడ సిటీ జనసేన పోటీ అభ్యర్థిని ప్రకటించలేదు - ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి (వైకాపా) వైకాపా
8) జగ్గంపేట జ్యోతుల నెహ్రూ (టిడిపి) - తోట నర్మింహ్మం (వైకాపా) టిడిపి కూటమి
9) అనపర్తి టిడిపి/బిజెపి అభ్యర్థిని ప్రకటించలేదు - ఎస్.సూర్యనారాయణరెడ్డి (వైకాపా) వైకాపా
10) రాజానగరం బత్తులబలరామకృష్ణ (జనసేన) - జక్కంపూడి రాజా (వైకాపా) టిడిపి కూటమి
11) రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు (టిడిపి) - మార్గాని భరత్ (వైకాపా) టైట్‌ఫైట్
12) రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి (టిడిపి) - చెల్లుబోయిన వేణు (వైకాపా) టిడిపి కూటమి
13) కొవ్వూరు (ఎస్సీ) ముప్పుడి వెంటేశ్వరరావు (టిడిపి) - తలారి వెంకట్రావు (వైకాపా) టైట్ ఫైట్
14) నిడదవోలు కందుల దుర్గేష్ (జనసేన) - శ్రీనివాసనాయుడు (వైకాపా) టైట్ ఫైట్
15) గోపాలపురం (ఎస్సీ) మద్దిపాటి రాజు (టిడిపి) - తానేటి వనిత (వైకాపా) టైట్ ఫైట్
16) రామచంద్రాపురం వాసంశెట్టి సుభాష్ (జనసేన) - పిల్లి సూర్యప్రకాష్ (వైకాపా) వైకాపా
17) ముమ్మడివరం దాట్ట సుబ్బరాజు (టిడిపి) - పొన్నాడ సతీష్‌కుమార్ (వైకాపా) టిడిపి కూటమి
18) అమలాపురం (ఎస్సీ) టిడిపి/జనసేన అభ్యర్థి ఇంకా ప్రకటించలేదు -పినెపి విశ్వరూప్ టిడిపి కూటమి
19) రాజోలు (ఎస్సీ) జనసేన,అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు - గొల్లపల్లి సూర్యారావు (వైకాపా) టిడిపి కూటమి
20) పి.గన్నవరం బిజెపి/టిడిపి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు - వి.వేణుగోపాల్ టిడిపి కూటమి
21) కొత్తపేట బండారు సత్యారావు (టిడిపి) - చిర్ల జగ్గిరెడ్డి (వైకాపా) టిడిపి కూటమి
22) మండపేట జోగేశ్వరరావు (టిడిపి) - తోట త్రిమూర్తులు (వైకాపా) టిడిపి కూటమి
23) ఆచంట పితాని సత్యనారాయణ (టిడిపి)- చెరుకువాడ శ్రీరంగనాథరాజు (వైకాపా) టిడిపి కూటమి
24) భీమవరం ఆంజనేయులు (జనసేన) - గ్రంథి శ్రీనివాస్ (వైకాపా) టిడిపి కూటమి
25) నర్సాపురం బొమ్మిడి నాయకర్ (జనసేన) - వరప్రసాదరాజు (వైకాపా) టిడిపి కూటమి
26) పాలకొల్లు నిమ్మల రామానాయుడు (టిడిపి) - శ్రీహరి గోపాలరావు (వైకాపా) టిడిపి కూటమి
27) తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ (జనసేన) - కొట్టు సత్యనారాయణ (వైకాపా) టైట్‌ఫైట్
28) తణుకు అరిమిల్లిరాధాకృష్ణ (టిడిపి) -కారుమూరి నాగేశ్వరరావు (వైకాపా) టిడిపి కూటమి
29) ఉండి మంతెన రామరాజు (టిడిపి) - నర్సింహరాజు (వైకాపా) టిడిపి కూటమి
30) ఉంగుటూరు ధర్మరాజు (జనసేన) -వాసుబాబు (వైకాపా) టైట్‌ఫైట్
31) దెందులూరు చింతమనేని ప్రభాకర్ (టిడిపి) - కొఠారు అబ్బయ్యచౌదరి (వైకాపా) టైట్‌ఫైట్
32) ఏలూరు బడేటి రాధాకృష్ణ (టిడిపి) - ఆళ్లనాని (వైకాపా) టైట్‌ఫైట్
33) పోలవరం (ఎస్సీ) జనసేన అభ్యర్థిని ప్రకటించలేదు - తెల్లం రాజ్యలక్ష్మి (వైకాపా) టిడిపి కూటమి
34) చింతలపూడి(ఎస్సీ) సొంగారాజకుమార్ (టిడిపి) - కంభం విజయరాజు (వైకాపా) టిడిపి కూటమి.