‘కరోనా’ టీకా విజయవంతం...!

మహమ్మారి ‘కరోనా’ను అంతం చేసే టీకా విజయవంతం అయింది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం రూపొందిస్తున్న వ్యాక్సిన్ విజయవంతంగా పనిచేస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రయోగాల్లో ఈ సూది మందును తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తి చైతన్యవంతమైందని వారు పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లకు ఎటువంటి హాని కలిగించలేదని లాన్సెట్ సైన్స్ జర్నల్ ఎడిటర్ రిచర్డ్ హోర్టన్ వెల్లడించారు. వ్యాక్సిన్ సురక్షితమని, తీసుకున్నవారికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని ఆయన తెలిపారు. ఆక్స్ఫర్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్ 1/2 దశ ప్రయోగ ఫలితాలు ప్రచురించామని, వ్యాక్సిన్ సురక్షితమని చక్కగాపనిచేస్తోందని వారు పేర్కొన్నారు. ఏప్రిల్ 23 నుంచి మే 21 వరకు క్లినికల్ ట్రయిల్స్ చేసినట్లు సంస్థ ప్రకటించింది. కాగా రష్యా టీకా కూడా వచ్చే నెలలో ప్రజలకు అందుబాటులోకి వస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. ఆగస్టు 3వ తేదీ నుంచి రష్యా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఈ టీకా మూడో దశ క్రినికల్ ట్రైల్స్ వేలాది మందిపై నిర్వహించనున్నారు. దీంతో పాటు సమాంతరంగా వేలాది మంది ప్రజలకు టీకాను వేయబోతున్నారు. సెచినోవ్ విశ్వవిద్యాయం అభివృద్ధి చేసిన ఈ కరోనా టీకాపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. తొలి రెండు దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి. ప్రపంచంలో వివిధ సంస్థలు టీకాను తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగా, రష్యా తొలి టీకాను అందించే దేశంగా నిలబోతోంది. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది మూడు కోట్ల డోస్‌లను ఉత్పత్తి చేయనున్నట్లు రష్యా ప్రకటించింది.