లేటెస్ట్

‘గవర్నర్‌’ ఆదేశాల‌ను ‘జగన్‌’ పాటిస్తారా...!?

రాష్ట్ర ఎన్నికల‌ కమీషనర్‌గా ‘నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌’ను తిరిగి నియమించాల‌ని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఎస్‌ఈసీగా ‘నిమ్మగడ్డ’ను నియమించాల‌ని ఆయన రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి లేఖ రాశారని చెబుతున్నారు. దీని ప్రకారం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు గవర్నర్‌ ఆదేశాల‌ను ముఖ్యమంత్రి ‘జగన్‌’ పాటిస్తారా..? లేదా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవాని రాష్ట్ర గవర్నర్‌ ఆదేశాల‌ను అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా పాటించాల్సిందే. అయితే ‘నిమ్మగడ్డ’ విషయం కోర్టులో ఉంది కనుక..ముఖ్యమంత్రి గవర్నర్‌ ఆదేశాల‌ను పాటించడానికి మరి కొంత సమయం కోరతారా...? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ‘నిమ్మగడ్డ’ వేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్‌పై స్టే ఇవ్వాల‌ని ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టులో ఈ విషయం తేల‌కుండా ఇప్పుడు ‘నిమ్మగడ్డ’ను ఎస్‌ఈసీగా నియమించలేమని  ఈ విషయంలో గవర్నర్‌ స్పష్టత ఇవ్వాల‌ని కోరే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో కేసు విషయంపై స్పష్టత వచ్చాక గవర్నర్‌ ఆదేశాల‌ను ప్రభుత్వం పాటించే అవకాశం ఉంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం  మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌, గవర్నర్‌ హరిచందన్ కల‌వబోతున్నారు. మంత్రుల‌ ప్రమాణస్వీకారం తరువాత వీరిద్దరూ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీలో దీనిపై స్పష్టత వస్తుందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. గవర్నర్‌కు అప్పుడు తమ వాదనను వినిపిస్తామని అధికారపార్టీ చెబుతోంది. మొత్తం  మీద..ఇప్పటికిప్పుడే గవర్నర్‌ ఆదేశాలు అమలులోకి వస్తాయా అనేది అనుమానాస్పదమేనంటున్నారు. చూద్దాం..ఏమి జరుగుతుందో..?

(254)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ