లేటెస్ట్

‘రామకృష్ణ,సదారావు, తిమ్మప్ప’ల‌కు ప్రమోషన్‌

రాష్ట్ర సమాచారశాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా పనిచేస్తోన్న ‘రామకృష్ణ, సదారావు, తిమ్మప్ప’ల‌కు ప్రభుత్వం ప్రమోషన్ క‌ల్పించింది. వీరి ముగ్గురిని డిప్యూటీ డైరెక్టర్లగా నియమిస్తూ సమాచారశాఖ ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి టి.విజయ్‌కుమార్‌రెడ్డి ఉత్తర్వుల‌ను విడుదల‌ చేశారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా రాష్ట్ర సమాచార కేంద్రం తిరుపతిలో సహాయ సంచాల‌కునిగా పనిచేస్తోన్న వై.రామకృష్ణను తూర్పుగోదావరి జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించారు. డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులైన ‘రామకృష్ణ’ సమాచారశాఖ కేంద్ర కార్యాయలంలో చాలా కాలం పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, తరువాత నవ్యాంధ్రలోనూ ఆయన పలువురు కమీషనర్ల వద్ద పిఎగా సేవ‌లు అందించారు. అదే విధంగా విజయవాడ సమాచార కేంద్రంలో పనిచేస్తోన్న కొంగలేటి సదారావును రాష్ట్ర సమాచారశాఖ కార్యాయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వుల‌ను జారీ చేశారు. కర్నూలు సమాచార కేంద్రంలో పనిచేస్తోన్న ‘తిమ్మప్ప’ను కర్నూలు జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించారు.

(173)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ