లేటెస్ట్

‘అచ్చెన్న’కు నో బెయిల్‌...!

టిడిఎల్‌పి ఉపనేత, ఎమ్మెల్యే ‘అచ్చెంనాయుడు’కు హైకోర్టు బెయిల్‌ నిరాకరించింది. ఈఎస్‌ఐ స్కామ్‌లో అరెస్టు అయిన ‘అచ్చెన్న’ బెయిల్‌ కోసం ధరఖాస్తు చేసుకోగా ఆయన పిటీషన్‌ను కొట్టి వేస్తూ కోర్టు తీర్పు చెప్పింది. కేసు కీల‌క దశలో ఉందని, విచారణ జరుగుతుందని, ప్రధానమైన నిందితుల్ని మరి కొంత మందిని అరెస్టు చేయాల్సి ఉందని ఈ పరిస్థితుల్లో ప్రధాన నిందితుడికి బెయిల్‌ ఇవ్వడం సరికాదని ఏసీబీ తరుపు న్యాయవాది చేసిన వాదనను హైకోర్టు అంగీకరించింది. ఈఎస్‌ఐ స్కామ్‌లో ‘అచ్చెన్న’ను ప్రధాన నిందితుడగా పేర్కొంటూ ఏసీబీ ఆయనను అరెస్టు చేసింది. ఆయన ఫైల్స్‌ ఆపరేషన్‌ చేయించుకున్నాడని చెప్పినా..పట్టించుకోకుండా అరెస్టు చేసి జైలుకు తరలించింది. తరువాత ‘అచ్చెన్న’కు వైద్యం అందించాల‌ని కోర్టు సూచించడంతో ఆయనను ముందుగా గుంటూరు ప్రభుత్వ హాస్పటల్స్‌లో చేర్చి వైద్యం అందించారు. గుంటూరు ప్రభుత్వ హాస్పటల్‌లో సరైన వైద్యం అందడం లేదని, తనను కార్పొరేట్‌ హాస్పటల్‌కు తరలించాని ఆయన హైకోర్టుకు విన్నవించడంతో ఆయనను కార్పొరేట్‌ హాస్పటల్‌లో ఉంచి వైద్యం చేయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తనకు బెయిల్‌ ఇవ్వాని ‘అచ్చెన్న’ హైకోర్టును కోరగా ఆయనకు తిరస్కారం ఎదురైంది. కాగా ‘అచ్చెన్న’కు బెయిల్‌ రాకుండా కొంత మందిని కావాల‌నే అరెస్టు చేయడం లేదని, విచారణ చేయడం లేదని, ఉద్దేశ్యపూర్వకంగానే ‘అచ్చెన్న’ను జైలులో ఉంచే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నారని ఆయన తరుపు న్యాయవాదులు వాదించారు. సాక్ష్యాలు సేకరించాల్సి ఉందని, అవి పూర్తి అయిన తరువాత మిగతా నిందితుల‌ను అరెస్టు చేస్తామని ఏసీబీ కోర్టుకు తెలిపింది. కాగా హైకోర్టు తీర్పుపై ‘సుప్రీం’కు వెళ్లే ఆలోచనలో ‘అచ్చెన్న’ ఉన్నట్లు తెలుస్తోంది.

(331)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ