లేటెస్ట్

బిజెపిని ఇంకా ‘ఆంధ్రా’ ప్రజలు నమ్ముతారా...!?

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ‘సోము వీర్రాజు’ నియామకం తరువాత..ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 2024లో బిజెపి`జనసేన అభ్యర్థి ‘ఆంధ్రప్రదేశ్‌’ ముఖ్యమంత్రి అవుతారని, రాబోయే మూడున్నర సంవత్సరాల్లో తాము రాష్ట్రంలో ప్రధాన పార్టీగా ఎదుగుతామని, అధికార వైకాపా, ప్రతిపక్ష టిడిపి పార్టీల‌కు తామే ప్రత్యామ్నాయమని, తమ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని చెప్పుకున్నారు. ఒక రాజకీయపార్టీ అధ్యక్షుడిగా ‘సోము’ ఆశల‌ను కాదనలేకపోయినా..వాస్తవాల‌ను పరిగణలోకి తీసుకుంటే, గతంలో ఆ పార్టీకి ఉన్న బలం, ఇతర పార్టీల‌కు ప్రస్తుతం ఉన్న బలాబలాను బేరీజు వేసుకుంటే ఆయన ఎంత అవాస్తవ ధోరణిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. 175 ఎమ్మెల్యేలు, 25 పార్లమెంట్‌ సీట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటును కూడా ప్రజలు ఇవ్వలేదు. విభజన చేసిన పాపాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్‌కు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదు...నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బిజెపి రాబోయో మూడున్నరేళ్లల్లో అద్భుతాలు చేసి అధికారంలోకి వస్తామంటే..స్వంత పార్టీ నాయకులు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఏమి చూసుకుని బిజెపి నాయకులు ఇలాంటి ల‌చేస్తున్నారో తెలియదు...ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని బల‌హీనపర్చి, ఆ పార్టీకి చెందిన నాయకుల‌ను లాక్కుని..వారి స్థానాల‌ను ఆక్రమించుకోవాల‌నే ఆశ బాగానే ఉంది..కానీ నాయకులు...వెళితే కార్యకర్తలు, ప్రజలు వారి వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారా..? అనే మౌళికమైన ప్రశ్న ఆలోచనాపరుల‌ నుంచి వస్తోంది. విభజన పాపంలో కాంగ్రెస్‌తో పాటు సమాన పాపాన్ని అంటగట్టుకున్న బిజెపి..తరువాత చేసిన ద్రోహాల‌ను ప్రజలు మరిచిపోతారా..? విభజన హామీలు, రాజధాని, పోల‌వరం, వెనుకబడిన ప్రాంతాలు, ప్రత్యేక ప్యాకేజీ వంటి పలు విషయాల‌ను బిజెపి మరిచిపోయినా..ప్రజలు మరిచిపోతారా..?

మోసాన్ని మరిచి..బిజెపి ప్రజలు అందలం ఎక్కిస్తారా..?

అస‌లు ఏమి చేశార‌ని ప్ర‌జ‌లు బిజెపిని అంద‌లం ఎక్కిస్తారు..? ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టడంలో కాంగ్రెస్‌ కంటే ఎక్కువ పాత్ర పోషించిన బిజెపి.. తల్లిని చంపి..బిడ్డకు ప్రాణాలు పోస్తున్నారని విమర్శించి, ఆంధ్రుల‌కు తామేదో ఒరగబెడతామని నాడు హామీు ఇస్తే..గుడ్డిగా నాడు ‘ఆంధ్రా’ ప్రజలు బిజెపి చేసిన మోసాన్ని పట్టించుకోకుండా నాడు ఆదరించారు. అధికారంలోకి వచ్చిన తరువాత..‘ఢిల్లీ’ కంటే మిన్నగా రాజధానిని నిర్మిస్తామంటే మురిసిపోయారు....మరి రాజధాని విషయంలో ఏమి చేశారు..? నేడు ఏమి చేస్తున్నారు. ప్రస్తుత పాల‌కులు మూడు రాజధానులు అంటే...మాకేమీ సంబంధం లేదంటూ ఆడుతున్న దొంగ నాటకాలు ప్రజల‌ దృష్టిని దాటిపోతున్నాయా..? రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటే..ఐదేళ్లు కాదు..పదేళ్లు కావాల‌న్న ‘బిజెపి’ నేడు...దాన్ని ఎందుకుప్రస్తావించడం లేదు..పోనీ ఇస్తామన్న ప్రత్యేకప్యాకేజీ గురించైనా మాట్లాడుతున్నారా..? ఆంధ్రుల‌ జీవనాడి ‘పోల‌వరం’ పడకేస్తున్నా..? పలు బడ్జెట్‌ల‌లో ఆంధ్రాకు నిధులు ఇవ్వకుండా ఎండబెడుతూ రాబోయే కాలంలో తామే అధికారంలోకి వస్తామంటే అది సాధ్యం అవుతుందా..? ‘ఆంధ్రా’ ప్రజలు అంత వెర్రివాళ్లా..? తమను పదే పదే మోసం చేస్తోన్న వాళ్లకు బంగారు పల్లెంలో పెట్టి అధికారాన్ని అప్పగించడానికి..కాంగ్రెస్‌ ముందు నుంచి పొడిస్తే..వెనుక నుంచి పొడిచి..నాటి గాయాల‌ను పదే పదే గెలుకుతూ కాల‌క్షేపం చేస్తోన్న ‘బిజెపి’ని ఆంధ్రా ప్రజలు అంత గుడ్డిగా నమ్ముతారని వారు భావిస్తుంటే..అంత కంటే వెర్రితనం మరొకటి లేదు. మూడు రాజధానుల‌ పేరిట అధికార పార్టీ చేస్తోన్న విన్యాసాల‌ను దగ్గరుండి చూస్తూ..ఇక్కడో మాట..అక్కడో మాట మాట్లాడుతూ కాల‌క్షేపం చేస్తోన్న ‘బిజెపి’ నాటకాన్ని ప్రజలు చూడడం లేదనుకుంటున్నారా..? కాంగ్రెస్‌ చేసిన ద్రోహానికి ఆ పార్టీని మళ్లీ లేకుండా బంగాళాఖాతంలో కలిపిన ‘ఆంధ్రా’ ఓట‌ర్లు..‘బిజెపి’ వంచనను అర్థం చేసుకోలేరా..? దెబ్బతిన్న పులి...అదను కోసం చూస్తున్నట్లు...సమయం కోసం వేచి చూస్తోన్న సగటు ‘ఆంధ్రా’ వాలా దెబ్బ ఎలా ఉంటుందో భవిష్యత్‌లో బిజెపి నేతలు చూస్తారు..అప్పటి దాకా..మేమే ముఖ్యమంత్రుం..మాదే రాష్ట్రం అనుకుంటూ బిజెపి నేతలు గాలి మేడలు కట్టుకోవాల్సిందే...!

(875)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ