లేటెస్ట్

‘ఎన్నికల‌ కమీషనర్‌గా ‘రమేష్‌కుమార్‌’ పునర్‌ నియామకం

‘నిమ్మ‌గ‌డ్డ‌’ నియామ‌కంపై జీవో విడుద‌ల చేసిన‌ ‘జ‌గ‌న్’ ప్రభుత్వం

రాష్ట్ర ఎన్నికల‌ కమీషనర్‌గా ‘నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌’ను తిరిగి నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం అర్థరాత్రి ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల‌ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల‌ మేరకు ‘రమేష్‌కుమార్‌’ను తిరిగి ఎన్నికల‌ కమీషనర్‌గా నియమిస్తున్నట్లు గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ పేరిట  పంచాయితీ రాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల‌కృష్ణ ద్వివేదీ నోటిఫికేషన్‌ను విడుదల‌ చేశారు. ‘నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌’ను ‘శుక్రవారం’ లోపు ఎన్నికల‌ కమీషనర్‌గా నియమించాలంటూ సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో అర్థరాత్రి ప్రభుత్వం జీవో విడుదల‌ చేసింది. కాగా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్పెషల్‌ లీవ్‌ పిటీషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడి ఈ పునర్నియాక నోటిఫికేషన్‌ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో ఎన్నికల‌ కమీషనర్‌గా ఉన్న ‘నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌’ తమకు చెప్పకుండా ‘కరోనా’ పేరుతో ఎన్నికల‌ను వాయిదా వేశారని ప్రభుత్వం ఆరోపించింది. తరువాత ఎన్నికల‌ సంస్కరణల‌ పేరిట ఆయనను తొల‌గించి ఆయన స్థానంలో తమిళనాడుకు చెందిన ‘కనగ్‌రాజ్‌’ను ఎన్నికల‌ కమీషనర్‌గా ప్రభుత్వం నియమించింది. దీనిపై ‘నిమ్మగడ్డ’ హైకోర్టును ఆశ్రయించగా..ఆయనకు అనుకూంగా తీర్పు వచ్చింది. 

దీన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. అయితే సుప్రీంలోనూ అదే తీర్పు రావడంతో..ఆయనను ఎన్నికల‌ కమీషనర్‌గా నియమించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ప్రభుత్వం అప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో ‘నిమ్మగడ్డ’ మళ్లీ హైకోర్టులో కోర్టు ధిక్క‌ర‌ణ పిటీష‌న్ దాఖ‌లు చేశారు.  త‌మ ఆదేశాల‌ను అమ‌లు చేయ‌క‌పోవ‌డంపై    హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..‘నిమ్మగడ్డ’ రాష్ట్ర గవర్నర్‌ వద్దకు వెళ్లాని, తన నియామకం గురించి ఆయనతో చెప్పాల‌ని సూచింది. ఈ మేరకు ‘నిమ్మగడ్డ’ గవర్నర్‌ను ఆశ్రయించినా ప్రభుత్వం ఆయనను మళ్లీ నియమించలేదు. పైగా కోర్టు ధిక్కరణపై స్టే ఇవ్వాంటూ మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే ఈ కేసు గురించి తమకు అంతా తెలుసునని, ‘శుక్రవారం’ లోపు ‘నిమ్మగడ్డ’ను రాష్ట్ర ఎన్నిక కమీషనర్‌గా నియమించాని పేర్కొంటూ ప్రభుత్వం కోరిన స్టేను నిరాకరించింది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం కోర్టులో మళ్లీ కేసు రానున్న నేపథ్యంలో గురువారం అర్థరాత్రి ‘నిమ్మగడ్డ’ను తిరిగి ఎన్నికల‌ కమీషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కారణంతో స్థానిక ఎన్నికల‌ను ‘రమేష్‌కుమార్‌’ వాయిదా వేయడంపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం, తరువాత ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు ‘నిమ్మగడ్డ’పై విరుచుకుపడడం, దానికి కౌంటర్‌గా టిడిపి, బిజెపి, సిపిఐ, జనసేన తదితర పార్టీలు ‘రమేష్‌కుమార్‌’కు మద్దతుగా నిలిచాయి. గడిచిన నాలుగున్నర నెల‌ల నుంచి ఇదే విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ జరిగింది. తనను తొల‌గించడంపై ‘రమేష్‌కుమార్‌’ పట్టు వీడకుండా చేసిన పోరాటం ఆయనను మళ్లీ ఎన్నిక కమీషనర్‌ సీటుపై కూర్చోపెట్టింది. మొత్తం మీద..రాష్ట్రంలో ఎంతో చర్చకు దారి తీసిన ‘నిమ్మగడ్డ’ వ్యవహారంపై చివరకు ప్రభుత్వం మెట్టు దిగాల్సి వచ్చింది.

(451)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ