లేటెస్ట్

ఇండియాటుడే సర్వేలో ‘జగన్‌’కు 3వ స్థానం

దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రుల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి 3వ స్థానం ల‌భించింది. ప్రముఖ ఆంగ్ల పత్రిక ఇండియాటుటే ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ పేరిట నిర్వహించిన సర్వేలో ముఖ్యమంత్రి ‘జగన్‌’ మూడో స్థానం పొందారు. ప్రతి ఏటా ‘ఇండియాటుడే’ ఈ సర్వేను నిర్వహిస్తూ ఉంటుంది. ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో ఉత్తమ ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ‘యోగీ ఆధిత్యనాథ్‌దాస్‌’ మొదటి స్థానంలో నిలవ‌గా తరువాత స్థానం ఢిల్లీ ముఖ్యమంత్రి ‘అరవింద్‌కేజ్రీవాల్‌’కు ల‌భించింది. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ‘జగన్‌’ ఉన్నారు. 24 మార్కుల‌తో ‘యోగి’ వరుసగా మూడో సారి బెస్ట్‌ సిఎంగా నిల‌వగా కేజ్రీవాల్‌ 15 మార్కుల‌తో రెండో స్థానం,  11 మార్కుల‌తో ‘జగన్‌’ మూడో స్థానంలో నిలిచారు. తరువాత 9 మార్కుల‌తో ‘మమతాబెనర్జీ’ నాలుగో స్థానంలో నిల‌వగా, 7 మార్కుల‌తో బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ఐదవ స్థానంలో ఉన్నారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి ‘కె.చంద్రశేఖర్‌రావు’ 3 మార్కుల‌తో 8వ స్థానంలో నిలిచారు. మొత్తం 12,021 మందిని ఫోన్ల ద్వారా ప్రశ్నించి ఈ సర్వేను రూపొందించినట్లు ‘ఇండియాటుడే’ ప్రకటించింది. జూలై15 నుంచి జూలై 27 వరకు ఈ సర్వేను నిర్వహించామని, దీనిలో 67శాతం మంది గ్రామీణ ప్రాంతం వారు ఉండగా 33శాతం పట్టణ ప్రాంత ప్రజలు ఉన్నట్లు, 97 పార్లమెంట్‌ నియోజకవర్గాలు, 194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించామని, ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, బీహార్‌, ఛత్తీస్‌ఘడ్‌, ఢిల్లీ, గుజరాత్‌, హర్యానా, జార్ఘండ్‌, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిస్సా, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రజలు ఈ సర్వేలో పాల్గొన్నారని ‘ఇండియాటుడే’ తెలిపింది. 

కాగా.. భారతదేశ ప్రధానిగా ఎవరు ఉండాల‌ని కోరుకుంటున్నారని ప్రశ్నించగా 66శాతం మంది ‘మోడీ’, 8శాతం మంది రాహుల్‌గాంధీ, 5శాతం మంది సోనియాగాంధీ, 4శాతం మంది ‘అమిత్‌షా’, 3శాతం మంది సిఎం యోగి ఆదిత్యనాథ్‌, 1శాతం మంది కేంద్ర మంత్రి గడ్కరీ 2శాతం మంది పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, 2శాతం మంది ప్రియాంకా గాంధీ, మహారాష్ట్ర సిఎం ఉద్దవ్‌ ధాక్రే, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఒక్కోశాతం మంది ఉండాల‌ని కోరుకుంటున్నారు. కేంద్రమంత్రుల్లో ‘అమిత్‌షా’ బాగా పనిచేస్తున్నారని సర్వే సంస్థ తెలిపింది. జమ్మూకాశ్మీర్‌ విషయంలో ‘మోడీ’ చర్యలు బాగున్నాయని, ఆర్థికవ్యవస్థను ‘మన్మోహన్‌సింగ్‌’ కన్నా ‘మోడీ’ బాగా నిర్వహిస్తున్నారని అభిప్రాయపడ్డారట. చైనా యాప్స్‌ను నిషేదించడాన్ని 91శాతం మంది సమర్థించారట. ప్రజల‌ను బెంబేలెత్తిస్తున్న ‘కరోనా’ విషయంలో ప్రధాని మోడీ బాగా చర్యలు తీసుకున్నారని 70శాతం మంది తెలిపారట. కరోనా దెబ్బకు తమ కుటుంబ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నట్లు 63శాతం మంది చెప్పారు.

(398)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ