లేటెస్ట్

‘కరోనా’ వ్యాక్సిన్‌ను విడుదల‌ చేసిన రష్యా...!

ప్రపంచాన్ని వణికిస్తోన్న ‘కరోనా’ మమ్మారిని కట్టడి చేయడానికి వివిధ దేశాలు చేస్తోన్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నాయి. ముందుగా అందరి కంటే ముందే తాము వ్యాక్సిన్‌ తెస్తున్నామని చెప్పిన రష్యా దాన్ని విజయవంతంగా ఆవిష్కరించింది. కరోనా వ్యాక్సిన్‌ను ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఈ రోజు విడుదల‌ చేశారు. ఈ మేరకు అధ్యక్ష భవనం ఒక ప్రకటనను విడుదల‌ చేసింది. కరోనా టీకాను ముందుగా తన కుమార్తె వేయించుకుందని ఆయన వెల్ల‌డించారు. టీకా ద్వారా రోగనిరోధకశక్తి పెరిగి వైరస్‌ నియంత్రణలోకి వస్తుందని ‘పుతిన్‌’ పేర్కొన్నారు. ‘కరోనా’ వ్యాక్సిన్‌ను మొదట వైద్య సిబ్బందికి, తరువాత ఉపాధ్యాయుల‌కు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. గత నెల‌ మొదట్లోనే తాము ఆగస్టులో టీకాను విడుదల‌ చేస్తామని రష్యా ప్రకటించింది. ఆ మాటను నిల‌బెట్టుకుంటూ రష్యా కరోనా టీకాను ఆవిష్కరించిన తొలి దేశంగా గుర్తింపు తెచ్చుకుంది.

(909)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ