లేటెస్ట్

ప్రతిపక్షంపై ఫైటింగ్‌ చేస్తే...ప్రజలు అందలం ఎక్కిస్తారా...!?

‘ఆరు నెలు సాము చేసి...మూల‌నున్న ముసల‌మ్మను కొట్టాడ’...అనేది పాత సామెత. ఈ సామెత....తెలుగు ప్రజందరికీ సుపరిచితమే...ప్రస్తుతం..రాష్ట్ర బిజెపి వ్యవహారం చూస్తుంటే...అచ్చం ఆ సామెతలానే ఉంది. ఎందుకంటే...ఆ పార్టీ ఇప్పుడు.. అటువంటి పనులే చేస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడి...ఇంకా లేవలేక..లేస్తుందో లేదో..తెలియక..బేల‌గా కూర్చున్న టిడిపిపై ‘బిజెపి’ ఫైటింగ్‌ చేస్తుందట. గత ఎన్నికల్లో తగిలిన కోలుకోలేని గాయాల‌తో సతమతం అవుతూ..వృద్ధ నాయకత్వం..ఏమి చేస్తుందో తెలియని అయోమయ స్థితిలో..ఎక్కడ చూసినా నిర్వేదం, నిస్పృహలో ఉన్న టిడిపిపై బిజెపి వేస్తోన్న అస్త్రాలు ‘ముసల‌మ్మ’ సామెతనే గుర్తు చేస్తున్నాయి. అధికారంలో ఉన్న వారిని వదిలేసి..దిక్కులేని స్థితిలో మూల‌నపడి ఉన్న ముసల‌మ్మను కొడతామని బిజెపి పెద్దలు ముక్తకంఠంతో చెబుతుంటే..వినేవారికి, చూసేవారికి ఆశ్చర్యం కలుగుతోంది.  జాతీయస్థాయి నాయకుల‌ నుంచి..రాష్ట్ర స్థాయి నాయకుల‌ వరకు...ఇదే వరుస. గతంలో చేసిన తప్పుల‌కు మూల్యం చెల్లించుకుంటూ..ల‌బోదిబోమంటూ పార్టీ ఉంటుందో ఉండదో..తెలియని స్థితిలోకి వెళ్లిన వారిపై ఈ ప్రతీకారాలు, అస్త్రాలు, శస్త్రాలు ఏమిటో తెలియక..బిజెపి తత్వం ఏమిటో అర్థం చేసుకోలేక సగటు ఆంధ్రా జనం  ఆశ్చర్యపోతున్నారు. పోనీ..వారు అనుకున్నట్లే..అన్నీ అయిపోయిన ‘ముసల‌మ్మ’లాంటి టిడిపిపై యుద్ధం చేస్తే...ఆంధ్రా ప్రజలు బిజెపిని ఏ విధంగా నెత్తికెత్తికుంటారో..ఎవరికీ తెలియని ప్రశ్న. అసలు..ఈ రాష్ట్ర ప్రజల‌కు బిజెపి ఏమి చేసిందని...వారిని ఆదరిస్తారో, అధికారపీఠంపై కూర్చోబెడతారో ఎవరికీ అర్థం కాని మిలియన్‌డార్ల ప్రశ్న.

ఉమ్మడి రాష్ట్ర విభజనలో సగ పాపం మూటగట్టుకున్న బిజెపిని...కాల‌గమనంలో ప్రజలు క్షమిస్తారని భావించినా...ఆరేళ్ల కాలంలో ఒక్కటైనా..ఇచ్చిన హామీల‌ను నెరవేర్చని..వారిని అందలం ఎక్కిస్తారని ఆశపడడం అవివేకమో..లేక..ప్రజలు అమాకత్వంపై బిజెపి పెద్దల‌కు ఉన్న భరోసానో...? కాంగ్రెస్‌ ఐదేళ్లు ప్రత్యేకహోదా..ఇస్తామంటే..కాదు..కాదు పదేళ్లు ఇవ్వాల‌ని నిల‌దీసిన బిజెపి నాయకులు..చివరికి హోదా..ఇవ్వకుండా సున్నం పెట్టి...నాటి ‘చంద్రబాబు’  నిధుల‌ ఆదుర్థతను ఆసరా చేసుకుని..ప్యాకేజీ..అన్నా..ప్రజల‌ను భయపెట్టో..బతిమాలో..వచ్చిందే చాల‌నుకుని ఆయన అనుకుంటే..చివరకు దానికి కూడా గుండు సున్నా పెట్టిన బిజెపి పెద్దలు..అరాచకత్వాన్ని ప్రజలు అప్పుడే మరిచిపోయి..అందలం ఎక్కిస్తారా..? ప్రత్యేకహోదా నుంచి పోల‌వరం, వెనుకబడిన జిల్లాల‌కు నిధులు, లోటు బడ్జెట్‌ వంటి అనేక హామీలు నెరవేర్చకపోతే పోయారు...ఇప్పుడు..అధికారంలో ఉన్న పార్టీ తప్పుల‌ను ప్రశ్నించకుండా, పోరాడకుండా ఆ పార్టీకి సహకరిస్తే ప్రజలు బిజెపిని నెత్తినపెట్టుకుంటారా..? ఒకవైపు మూడు రాజధానుల‌ వ్యవహారంలో అధికారపార్టీ..ఆగమేఘాల‌పై పరుగులు తీస్తుంటే..దానికి బిజెపి పెద్దలు కళ్లెం వేస్తారని..ఎంతగానో..ఎదురు చూస్తోన్న ప్రజలు ఆశపై నీళ్లు జల్లిన బిజెపి నేతల‌ను ఆంధ్రాప్రజలు అధికారపీఠంపై కూర్చోబెడతారా..? దళితుల‌పై దాడులు, ప్రతిపక్షాల‌పై దాడులు, మీడియాపై దాడులు చేస్తుంటే..నిలువునా..చూస్తూ..పోరాడకుండా..అధికారపార్టీకి వంతపాడుతున్నందుకు అందలం ఎక్కిస్తారా..? వాళ్లు అనుకున్నట్లు...ముందు ప్రధాన ప్రతిపక్షం ఖతమైతే...అధికారపార్టీకి వంత పాడే...పార్టీల‌ను ప్రజలు అందలం ఎక్కిస్తారా..? గతంలో ఇచ్చిన హామీను నెరవేర్చకుండా,  మోసపూరిత విధానాల‌ను అవలంభిస్తోన్న బిజెపి ఇక్కడ అధికారం అందుకోవాలంటే తల‌కిందులుగా తపస్సు చేయాల్సిందే. 

(1069)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ