లేటెస్ట్

స్టేటస్‌కోపై 17న ‘సుప్రీం’లో విచారణ

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల‌ ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు చట్టాల‌పై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కోపై వచ్చే సోమవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మూడు రాజధానుల‌ ఏర్పాటు, సీఆర్డీఏ రద్దును వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. వీరి పిటీషన్లును విచారించిన హైకోర్టు న్యాయస్థానం ఈ నెల‌14వ తేదీ వరకు స్టేటస్‌కో విధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు విధించిన స్టేటస్‌కోను ఎత్తివేయాల‌ని తమ పిటీషన్‌లో పేర్కొంది. అయితే వాస్తవానికి ఈ పిటీషన్‌ ఎప్పుడో విచారణకు రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌లో తప్పులు ఉండడంతో ఇది వాయిదాపడింది. కాగా సోమవారం నాడు స్టేటస్‌కో, అమరావతిలో ఇళ్ల స్థలా పంపిణీ, ఆర్‌-5 జోన్లపై దాఖలైన వాజ్యాల‌ను కూడా న్యాయస్థానం విచారించబోతోంది. హైకోర్టు ఇఛ్చిన స్టేటస్‌కోను సుప్రీంకోర్టు కొట్టివేస్తే..వెంటనే ‘విశాఖ’లో పాల‌నారాజధానికి శంఖుస్థాపను చేయాల‌ని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆ మేరకు అక్కడ ఏర్పాట్లు చేసుకుంది. సోమవారం నాడు కనుక సుప్రీం రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తే..ఈ మాసంలోనే విశాఖలో రాజధానికి శంఖుస్థాపన చేస్తారని కొంత మంది సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. ఒక వేళ హైకోర్టు తీర్పునే సుప్రీం సమర్థిస్తే...దసరా సమయానికి కోర్టులో ఉన్న పిటీషన్లు పరిష్కరించుకుని..రాజధాని శంఖుస్థాపన చేయాల‌ని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. మొత్తం మీద..17న సుప్రీంలో రానున్న తీర్పు ఇరు పక్షాల‌కు కీల‌కమైనద‌నడంలో ఎటువంటి సందేహం లేదు.

(877)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ