లేటెస్ట్

‘ధర్మపోరాటదీక్షల‌’పై లోకాయుక్తలో కేసు

రాష్ట్రానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్యాయం చేసిందని, రాష్ట్రానికి ఇస్తానన్న ప్రత్యేకహోదా ఇవ్వలేదని, నిధులు ఇవ్వలేదని ఆక్షేపిస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల‌కు ముందు చేసిన దీక్షపై లోకాయుక్తలో కేసు నమోదు అయింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, తన ప్రతిష్ట పెంచుకునేందుకు ‘చంద్రబాబునాయుడు’ రకరకాల‌ దీక్ష పేరుతో దాదాపు రూ.76 కోట్లు దుర్వినియోగం చేశారని, దీనిపై విచారణ జరిపి నిధుల‌ను దుర్వినియోగం చేసిన వారి నుంచి రికవరీ చేయాల‌ని రమణ అనే న్యాయవాది లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై లోకాయుక్త స్పందించింది.  దీనిపై ప్రతివాదుల‌కు లోకాయుక్త నుంచి నోటీసు జారీ చేస్తూ కేసును 1అక్టోబర్‌ 2020కు వాయిదా వేసింది. నాటి దీక్షల‌కు బాధ్యులుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అప్పటి ఆర్థికశాఖ కార్యదర్శి రవిచంద్ర, పొలిటికల్‌ కార్యదర్శి జిఎడి ఎన్‌.శ్రీకాంత్‌, అప్పటి ఎ.పి.భవన్‌ రెసిడెంట్‌ కమీషనర్‌ ప్రవీణ్‌ప్రకాష్‌, అప్పటి అనంతపురం, విశాఖపట్నం కలెక్టర్లకు నోటీసులు జారీచేశారు.   రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేసిందని పేర్కొంటూ అప్పటి టిడిపి ప్రభుత్వం 13జిల్లాల్లో ధర్మపోరాట దీక్షల‌ను నిర్వహించింది. అదే విధంగా ఢిల్లీలోనూ ధర్నాను నిర్వహించింది. వీటన్నింటికి ప్రభుత్వం నుంచి నిధుల‌ను తీసుకున్నారని, పార్టీ ప్రతిష్ట కోసం నిర్వహించే ధర్నాల‌కు ప్రజల‌ సొమ్ము ఖర్చు చేయడం ఏమిటని ఫిర్యాదు దారు ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా పైచేయి సాధించేందుకు ప్రజల‌ సొమ్మును ఇష్టానుసారంగా ఖర్చు చేసిన నాటి పాల‌కుల‌పై, అధికారుల‌పై చర్యు తీసుకోవాల‌ని ఆయన లోకాయుక్తను ఆయన కోరారు.

(365)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ