లేటెస్ట్

‘రాధాకృష్ణా’ నీ సల‌హాలు అక్కర్లేదు:సోము వీర్రాజు

‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన స‌ల‌హాలు తమ  అక్కర్లేదని, ఆయన ఏ ఉద్దేశ్యంతో సహాలు ఇస్తున్నాడో తమకు తెలుసనని, ఆయన విషయం బిజెపి అగ్రనాయకుల‌కు తెలియచేస్తానని సోము వీర్రాజు అన్నారు. ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో ‘రాధాకృష్ణ’ రాసిన వ్యాసంలో ‘మీ జీవీఎల్‌, మీ ఇష్టం’ అనే శీర్షికతో విశ్లేషణ చేశారని, మా జీవీఎల్‌ చంద్రబాబుగారిని విమర్శించడం మాకే మంచిది కాదని మీ అమోఘమయిన విశ్లేషణ ద్వారా తెలిపారని, ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి ఎదగాలంటే జీవీఎల్‌ను పక్కన పెట్టాల‌ని చేసిన విశ్లేషణ సరికాదని, మీరు ఎందుకు ఈ విధమైన విశ్లేషణ చేస్తున్నారో తమకు తెలుసనని పేర్కొంటూ ‘సోము వీర్రాజు’ ‘రాధాకృష్ణ’కు లేఖ రాశారు. గతంలో అడ్డగోలుగా ప్రధాని మోడీ, వారి కుటుంబాన్ని, బిజెపిని టార్గెట్‌ చేసిన ‘రాధాకృష్ణ’కు సడన్‌గా బిజెపిపై ప్రేమ పుట్టిందని, మేము ఆంధ్రప్రదేశ్‌లో ఎదగటం లేదని మీరు తెగ ఫీల్‌ అవుతున్నారని, మీ విశ్లేషణ కొత్తగా బిజెపిపైన పుట్టిన ప్రేమ కాదని, ఇది పతనానికి దగ్గరల్లో ఉన్న చంద్రబాబును, టిడిపిని రక్షించడానికి ప్రయత్నమని, మీరు టిడిపికి సల‌హాదారుగా, అనుకూలంగా పనిచేస్తారని ప్రజలు అనుకుంటున్నారని, మరీ ఇంత పబ్లిక్‌గా, నిర్లజ్జగా పత్రికను అడ్డం పెట్టుకుని మా పార్టీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగదని ఆయన విమర్శించారు. మీ సల‌హా వల్లే టిడిపికి 23 సీట్లు వచ్చాయని, ఇప్పుడు మళ్లీ ఆ పార్టీకి సహాలు కొనసాగిస్తూపోతే రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ రెండు మూడు స్థానాల‌కు పడిపోవడం గ్యారంటీని అని ఆయన పేర్కొన్నారు. మీరు మా జాతీయ నాయకత్వానికి  మా నాయకుల‌ను ఎలా కట్టడి చేయాలో, మా పార్టీని ఎలా కాపాడుకోవాలో సెల‌విచ్చారు..ఈ విశ్లేషణలోని అసలు మతల‌బు ఏమిటో, మీ అసలు తాపత్రయం ఏమిటో వారికి త్వరలో వివరిస్తాను..మీరేం దిగులుపడనవసరం లేదని ఆయన ‘రాధాకృష్ణ’ను లేఖలో కోరారు.

(481)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ