లేటెస్ట్

జోక్యం చేసుకోం:సుప్రీంకోర్టు

రాజధాని వికేంద్రీకరణపై హైకోర్టులో జరుగుతున్న విచారణలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పాల‌నా వికేంద్రీకరణ, సీఆర్డీఎ రద్దు చట్టాల‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వుల‌ను రద్దు చేయాల‌ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.పాషాల‌తో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థునను తోసిపుచ్చింది. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని, మూడు రాజధానుల‌ వ్యవహారం హైకోర్టులో విచారణ ఉన్నందున తమ వద్దకు రావడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నిర్ణీత గడువులో విచారణను ముగించాల‌న్న ప్రభుత్వ న్యాయవాది కోరికను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసును త్వరగా హైకోర్టు పరిష్కరిస్తుందని సుప్రీంకోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది.

(287)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ