లేటెస్ట్

మద్యం ధరలు తగ్గింపు

తక్కువ రకం మద్యం ధరల‌ను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 180 ఎంఎల్‌ మద్యం రూ.150జ‌- కంటే తక్కువ ఉన్న బ్రాండ్లపై ధరను తగ్గిస్తూ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వుల‌ను జారీ చేసింది. దీనితో పాటు అన్ని రకాల‌ బీర్లపై రూ.30/-, రెడీ టూ డ్రింక్‌ మద్యంపై రూ.30/-ల‌ఉ తగ్గించింది. అదే సమయంలో 90ఎంఎల్‌ రూ.190 నుంచి రూ.600/- వరకు ఉన్న మద్యంపై ధరల‌ను పెంచారు. సవరించిన ధరలు ఈ రోజు నుంచే అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఇతర రాష్ట్రాల‌ నుంచి అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు తక్కువ బ్రాండ్ విలువ ఉన్న మద్యం ధరల‌ను తగ్గించాలంటూ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో పలుచోట్ల శానిటైజర్లు, మిథైల్ ఆల్క‌హాల్‌ తాగి కొంత మంది మృతి చెందడం, అక్రమ మద్యం రవాణా నేపథ్యంలో ప్రభుత్వం మద్యం ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల‌ నుంచి భారీగా మద్యం దిగుమతి అవుతుండడంతో రాష్ట్రంలోని మద్యం ప్రియులు ఆయా రాష్ట్రాల‌ మద్యాన్నిఅధిక ధ‌ర‌ల‌కు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున గండి పడుతోంది. ఇతర రాష్ట్రాల్లో నాణ్యమైన, మంచి బ్రాండ్‌ మందు రాష్ట్రం కంటే తక్కువ రేటుకు వస్తూండడంతో వాళ్లంతా వాటి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. మద్యం ధరలు భారీగా పెంచితే మద్యానికి అల‌వాటుపడ్డ వారు మద్యానికి దూరం అవుతారని ప్రభుత్వం ఆశించింది. అయితే వారు ఆశించిన విధంగా జరగకపోవడంతో పాటు కల్తీ  మద్యం, నాటుసారా ఉత్పత్తి చేస్తూండడం ప్రభుత్వానికి తల‌నొప్పిగా తయారైంది. దీంతో తక్కువ ధర మద్యం రేట్లను తగ్గించాల‌నే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది.చాలా రోజుల నుంచి ప్రభుత్వం మ‌ద్యం రేట్ల‌ను త‌గ్గిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అనుకున్న‌ట్లుగానే ప్రభుత్వం త‌గ్గింపు నిర్ణ‌యాన్ని ఈ రోజు ప్ర‌క‌టించింది.

(244)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ