లేటెస్ట్

‘చంద్రబాబు’కు తృటిలో తప్పిన ప్రమాదం

మాజీ ముఖ్యమంత్రి ‘నారా చంద్రబాబునాయుడు’ రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ రోజు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని కారు చౌటుప్పల్‌ మండం దండుమల్కాపురం వద్ద ఆవు అడ్డుగా రావడంతో ఒక్కసారిగా డ్రైవర్‌ బ్రేక్‌ వేయడంతో కాన్వాయ్‌లోని వాహనం మరో వాహనాన్ని గుద్దుకుంది. దీని వెనుకే ‘చంద్రబాబు’ ప్రయాణిస్తున్న వాహనం ఉండగా డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో తృటిలో ప్రమాదం తప్పిపోయింది. కాన్వాయ్‌లోని ఓ వాహనం భారీగా డ్యామేజీ అయింది. ఒక వాహనానికి మరో వాహనం గుద్దుకోవడంతో ‘చంద్రబాబు’ అక్కడే 15 నిమిషాలు ఆగిపోయారు. తరువాత వాహనాన్ని అక్కడ వదిలేసి దానిలో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది మరో వాహనంలోకి మారడంతో ‘చంద్రబాబు’ కాన్వాయ్‌ అక్కడ నుంచి వెళ్లిపోయింది. ‘చంద్రబాబు’కు తృటిలో ప్రమాదం తప్పడంతో పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు.

(574)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ