లేటెస్ట్

‘ఈజ్‌ ఆప్‌ డూయింగ్‌’లో ‘ఆంధ్రా’కు అగ్రస్థానం

ప్రతిష్ఠాత్మకమైన ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌’లో  ఆంధ్రప్రదేశ్ మళ్లీ నెంబర్‌వన్‌ స్థానాన్ని సంపాదించింది. గత ఐదేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ సుల‌భతర వాణిజ్యంలో అగ్రస్థానాన్ని సాధిస్తూ వస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగినప్పటి నుంచి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఆంధ్రా, తెలంగాణాలు మొదటి స్థానానికి పోటీ పడుతున్నాయి. గత ఐదేళ్లల్లో ఒక్కసారి ఆంధ్రా, తెలంగాణలు కల‌సి ఉమ్మడిగా నెంబర్‌వన్‌లో నిలువగా తరువాత నాలుగేళ్లు ‘ఆంధ్రప్రదేశ్‌’ నెంబర్‌వన్‌ స్థానాన్ని నిల‌బెట్టుకుంటూ వస్తోంది. ఈ సారి కూడా అదే విధంగా ‘ఆంధ్రా’ తన స్థానాన్ని నిలుపుకుంది. మార్చి 2019 వరకు రాష్ట్రంలో అమలు చేసిన సంస్కరణల‌ను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంక్‌ను ప్రకటిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మిలా సీతారామన్‌ తెలిపారు. ప్రస్తుతం ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌వన్‌ స్థానంలో నిల‌వగా ఉత్తర ప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాది రెండో స్థానంలో ఉన్న ‘తెలంగాణ’ ఈసారి 3వస్థానంలోకి వెళ్లింది. కాగా రాష్ట్రంలో ఈ ర్యాంకుల‌ విషయంలో ఎప్పటి వలే రాజకీయం నడుస్తోంది. అధికార వైకాపా పార్టీ ఇది తమ ఘనత అని, తమ ముఖ్యమంత్రి పరిపాల‌నకు వచ్చిన అవార్డు అని ప్రకటించగా, ప్రతిపక్ష తెలుగుదేశం అది తమ హయాంలో అమలు చేసిన సంస్కరణ వ‌ల్ల‌ వచ్చిన ర్యాంక్‌ అని కౌంటర్‌ ఇచ్చింది. తమ ప్రభుత్వం మే2019 వరకు అధికారంలో ఉందని, ప్రస్తుతం కేంద్రం లెక్కలోకి తీసుకున్న సంస్కరణలు మార్చి 2019కు ముందువని...ఇది తమ ఘనత అని చెప్పుకుంటోంది. మొత్తం మీద..సుల‌భతర వాణిజ్యంలో ‘ఆంధ్రా’కు ఎదురులేదని మరోసారి రుజువైంది.

(281)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ