లేటెస్ట్

అతిపెద్ద కోవిద్ హాస్ప‌ట‌ల్ మూసివేత

మహమ్మారి కోవిద్‌ బాధితుల‌ను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన అతి పెద్ద కోవిద్‌ కేర్‌ సెంటర్‌కు పేషంట్లు రాక మూసివేయాల‌ని నిర్ణయం తీసుకున్నారు. కోవిద్‌ విస్తృతంగా వ్యాప్తిచెందుతుందని ఆగ మేఘాల‌పై 10వేల‌ బెడ్స్‌తో బెంగుళూరులో ఏర్పాటు చేసిన కోవిద్‌ సెంటర్‌ను సెప్టెంబర్‌15 నుంచి మూసివేయాల‌ని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిద్ ల‌క్షణాతో కోవిద్‌కేర్‌ సెంటర్‌కు వచ్చిన వారికి సరైన వైద్య సౌకర్యాలు అందించాల‌నే ల‌క్ష్యంతో బెంగుళూరు ఇంటర్నేషనల్‌ ఎగ్జిభిషన్‌సెంటర్‌ను కోవిద్‌కేర్‌ హాస్పటల్‌గా మార్చారు. అయితే ఈ కోవిద్‌కేర్‌ సెంటర్‌కు కోవిద్‌ బాధితులు పెద్దగా రావడం లేదని, దీన్ని మూసివేయాల‌ని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిద్‌ కేర్‌ సెంటర్‌ కోసం పెద్ద ఎత్తున్న బెడ్స్‌, పరువులు, ప్యాన్స్‌, డస్ట్‌బిన్స్‌ వంటి వాటిని భారీ స్థాయిలో కర్నాటక ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పుడు వీటిని ఇప్పుడు ఇతర ప్రభుత్వ హాస్పటల్స్‌కు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కోవిద్ ల‌క్షణాలు కనిపించిన వారు ఇంట్లో ఉండే చికిత్స తీసుకోవాల‌ని, కోవిద్ వ‌ల్ల‌ ఆరోగ్యం క్షీణించిన వారే హాస్పటల్స్‌కు రావాల‌ని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ‌ల్ల‌ కోవిద్‌ బాధితులు కోవిద్‌ కేర్‌ సెంటర్‌కు రావడం లేదని తెలుస్తోంది. కాగా ఈ కోవిద్‌ సెంటర్‌ ఏర్పాటు చేసిన సమయంలో అధికార బిజెపి దీనిలో భారీగా అవినీతికి పాల్ప‌డిందని ప్రతిపక్షం తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించింది.

(329)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ