'రాజమౌళి, ప్రద్యుమ్నే' ముద్దు...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రాజమౌళి, ప్రద్యుమ్నే' ముద్దు...!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యాలయంలో వివిధ హోదాలలో అనేక మంది బాధ్యతలు నిర్వహిస్తుండగా వారిలో ఇద్దరు అధికారులను మాత్రమే ఆయన సంపూర్ణంగా నమ్ముతున్నారు. సిఎం కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 'సతీష్‌చందర్‌', మరొక అధికారి 'సాయిప్రసాద్‌' కన్నా 'రాజమౌళి, ప్రద్యుమ్నలపైనే సిఎం ఆధారపడుతున్నారు. వీరిలో 'రాజమౌళి' అత్యంత నిజాయితీపరుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ప్రద్యుమ్న కూడా మంచి అధికారిగా పేరున్నప్పటికి చిన్న చిన్న విమర్శలు ఆయనపై వచ్చాయి. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 'సతీష్‌చంద్ర' మాయమాటలతో మభ్యపెడుతూ మంత్రులను అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నమ్మకాన్ని కోల్పోయారు. అదే విధంగా 'సాయిప్రసాద్‌' అహంకారంతో వ్యవహరిస్తున్నారు. ఈ అధికారి కార్యాలయ సిబ్బంది వసూళ్లపై రకరకాల కథనాలు బయటకు వస్తున్నాయి. బయటి వ్యక్తికి లక్ష రూపాయలు జీతం ఇప్పిస్తూ పనిచేయించుకుంటున్నారు. ఈ ఇద్దరిపై అధికారపార్టీ నాయకులతో పాటు మెజార్టీ ఐఎఎస్‌ అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి నిర్వాహకం సిఎం చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లిందట. అందుకనేనేమో ఇటీవల జరిగిన ఐఎఎస్‌ అధికారుల బదిలీల్లో ఈ ఇద్దరు అధికారుల ప్రభావం పనిచేయలేదు. దీంతో వారిని సిఎం పక్కన పెట్టి 'రాజమౌళి'పై ఎక్కువ ఆధారపడుతూ ఆయననే ఎక్కువగా నమ్ముతున్నారట చంద్రబాబు. కాగా 'ప్రద్యుమ్న'పై కొంత మేరకే ఆధారపడుతూ ముఖ్య విషయాలు ఆయనకు సిఎం తెలియనీయడం లేదట. వెలగపూడిలో నిర్మిస్తున్న సచివాలయం పూర్తిస్థాయి అందుబాటులోకి వచ్చిన అనంతరం 'సాయిప్రసాద్‌, సతీష్‌చంద్ర'ను తప్పిస్తారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. నిన్న మొన్న వరకు 'సతీష్‌' కేంద్ర సర్వీసులకువెళతారని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని 'సతీష్‌' ఖండిస్తున్నారట. తాను కేంద్ర సర్వీసులకు వెళ్లనని,రాష్ట్ర సర్వీసులలోనే కొనసాగుతానని చెబుతున్నారట.అయితే ఈ విషయాన్ని అధికారులు నమ్మడం లేదట. కాగా 'సాయిప్రసాద్‌' పనితీరుపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందడడంతో ఆయనను తప్పించి ఆ బాధ్యతలను 'రాజమౌళి'కి అప్పగించే అవకాశాలు ఉన్నాయి. గతంలో 'ప్రద్యుమ్న'ను బదిలీ చేసి ఆయన స్థానంలో చిత్తూరు కలెక్టర్‌ 'సిద్దార్థజైన్‌'ను నియమిస్తారని ప్రచారం జరిగినా అది అమలు కాలేదు. భవిష్యత్‌లో కూడా అమలు అయ్యే అవకాశాలు లేవని తాజా పరిస్థితి బట్టి తెలుస్తోంది.

(676)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ