లేటెస్ట్

రూ.10వేల కోట్ల కుంభ‌కోణం:ఆల‌పాటి

పేద‌ల‌కు సెంటు భూమి ఇస్తున్నామంటూ ప్రభుత్వ పెద్ద‌లు రూ.10వేల‌కోట్ల కుంభ‌కోణానికి తెర‌లేపార‌ని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమ‌ర్శించారు.ప్రభుత్వం పేదలకు 40వేల ఎకరాలు పంచాలని నిర్ణయం తీసుకుంటే, అందులో కేవలం 4వేల ఎకరాలపై మాత్రమే కోర్టులు స్టేలు విధించాయని, మిగిలిన 36వేల ఎకరాల భూమిని పేదలకు పంచడానికి ప్రభుత్వానికి ఉన్న సమస్య ఏమిటని ఆయన ప్రశ్నించారు. సేకరించిన భూమిని మెరకచేయడం, చదును కోసమని దాదాపు రూ.10వేలకోట్ల కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. పేదలకు సెంటు ఇస్తూ, మూడుసెంట్లను ప్రభుత్వం కొట్టేస్తోందన్నారు. టీడీపీ ప్రభుత్వం నిర్మించిన 6లక్షల ఇళ్లను పేదలకు ఇవ్వడానికి, నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి ప్రభుత్వానికి ఉన్న సమస్యేమిటని రాజా ప్రశ్నించారు. పేదలకు న్యాయం చేస్తామంటే ప్రతిపక్షం అడ్డుకుంటోందని, చెబుతున్న పాలకులు తక్షణమే తమ ఆధీనంలో ఉన్న భూమిని పేదలకు పంచి చిత్తశుధ్దిని నిరూపించుకోవాలన్నారు. ప్రజలకు మేలుచేస్తున్నామని చెబుతూ, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నది వైసీపీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. పేదవాడి గోచీని కూడా లాగేసుకునే దుస్థితికి ప్రభుత్వం చేరిందని ఆలపాటి రాజా పేర్కొన్నారు.

(197)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ