WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రిఫరెండం'కు వ్యతిరేకంగా 'లండన్‌'లో భారీ ర్యాలీ...!

యూరోపియన్‌ యూనియన్‌ నుంచి విడిపోవాలని చారిత్రాత్మక ఓటు వేసిన బ్రిటన్‌ పౌరులు అది ఎంత తప్పో తెలుసుకుని మళ్లీ తాము 'ఈయూ'లోనే ఉండాలని డిమాండ్‌ చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. బ్రెగ్జిట్‌ పరిణామాల తరువాత 'లండన్‌' మహానగరంలో రిఫరెండంపై వ్యతిరేకత రోజు రోజుకు పెరిగిపోతోంది. బ్రిటన్‌ ఈయూలోనే ఉండాలని కోరుతూ 'మార్చి ఫర్‌ యూరప్‌' పేరుతో 'లండన్‌' మహానగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా 'బ్రిమెయిన్‌' నినాదాన్ని తెరపైకి తీసుకొస్తూ...'బ్రిమెయిన్‌', 'ఉయ్‌ లవ్‌ ఈయూ' ప్లకార్డులతో ప్రదర్శనకారులు ఇందులో పాల్గొన్నారు. ప్రదర్శకులు పార్లమెంట్‌ స్క్వేర్‌లో ఆందోళన చేపట్టడానికి ముందు పార్క్‌లేన్‌ వద్ద సమావేశమయ్యారు. స్త్రీలు, వృద్ధులు, పిల్లలతో పాటు వేలాది మంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. వీరిలో లండన్‌వాసులతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, యూరోపియన్లు ఉన్నారు. బ్రెగ్జిట్‌ రెఫరెండం సమయంలో ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చారని ప్రదర్శకుల్లో ఒకరైన మార్గ్‌ థామస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈయూ నుంచి యుకె నిష్క్రమణ ప్రక్రియ ప్రారంభం కాకుండా ఆర్టికల్‌ 50ని ప్రభుత్వం నిలుపుదల చేస్తుందన్న ఆశాభావాన్ని ప్రదర్శన నిర్వాహకుడు కైరన్‌ మెక్‌డెర్మాట్‌ వ్యక్తం చేశారు.

(315)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ