లేటెస్ట్

దళితుల‌పై మొసలి కన్నీరు కారుస్తున్న ‘చంద్రబాబు’:జూపూడి

ఎవరైనా దళితులుగా పుట్టాల‌ని కోరుకుంటారా..? అంటూ ఒకప్పుడు దళితుల‌ను అవమానపర్చిన ‘చంద్రబాబు’ నేడు దళితుల‌పట్ల పెద్ద ప్రేమ ఉన్నట్లు..వారిని ఉద్దరిస్తున్నట్లు నటిస్తూ వారిపై మొసలి కన్నీరు కారుస్తున్నారని వైకాపా నాయకుడు ‘జూపూడి ప్రభాకర్‌రావు’ విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు దళితుల‌ సమస్యల‌ను పట్టించుకోకుండా, దళితుల‌కు అన్యాయం చేసిన ‘చంద్రబాబు’ నేడు వారిపై దాడులు జరుగుతున్నాయని, ఇంకేదో జరుగుతోందంటూ విమర్శులు గుప్పిస్తూ వైకాపా ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాల‌ని ప్రయత్నిస్తున్నారని, కానీ ఆయన ఆటలు సాగవని, రాష్ట్రంలోని దళితులు, మైనార్టీలు అందరూ ముఖ్యమంత్రి ‘జగన్‌’ వెంట ఉన్నారని ఆయన గుర్తుంచుకోవాల‌న్నారు. మంత్రివర్గంలో సింహభాగం దళితుల‌కు, మైనార్టీల‌కు ‘జగన్‌’ పెద్దపీట వేశారని, దీన్ని జీర్ణించుకోలేని ‘చంద్రబాబు’ అసత్యప్రచారానికి పూనుకున్నారని ‘జూపూడి’ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట కొన్ని సంఘటనలు జరిగితే వాటిని బూతద్దంలో చూపిస్తూ ప్రభుత్వంపై బురద జల్ల‌ డానికి తండ్రీ,కొడుకులు ప్రయత్నిస్తున్నారని, వారి మాటలను దళితులు నమ్మరని ఆయన అన్నారు. 

సిఎం దళిత వ్యతిరేకి అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ ప్రభుత్వం తమదని దళితులు సగర్వంగా చెప్పుకుంటున్నారని ఇటువంటి పరిస్థితుల్లో ‘చంద్రబాబు’ చెప్పే మాటలు ఎవరూ నమ్మరని ‘జూపూడి’ అన్నారు. ‘చంద్రబాబు’ ఎస్టీ వర్గానికి చెందిన ‘డీజీపీ’ని అవమానిస్తున్నారని, ప్రతిపక్షనాయకుడిగా ‘చంద్రబాబు’ లేఖ రాయాల‌నుకుంటే ముఖ్యమంత్రికి రాయాల‌ని అలా కాకుండా ‘డీజీపీ’కి లేఖ రాయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడే కాదు..చాలా కాలంగా ‘డీజీపీ’ని ‘చంద్రబాబు’ అవమానిస్తున్నారని, ఆయనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో టిడిపి కనుమరుగు అయిందని, మాజీ న్యాయమూర్తి రామకృష్ణ గత అయిదు సంవత్సరాల్లో ‘చంద్రబాబు’ చుట్టూ తిరిగినా అతని సమస్య ఎందుకు పరిష్కరించలేదని ఆయన ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పోటీ పడలేక దళితుల‌ను అడ్డంపెట్టుకుని ఆయనపై విష ప్రచారం చేయాల‌ని ప్రయత్నిస్తున్నారన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో దళితుల‌పై దాడులు జరిగినప్పుడు అప్పటి హోంమంత్రి, డీజీపీ ఎప్పుడైనా వెళ్లారా..? ఇప్పుడు హోంమంత్రి, డీజీపీ దళితులు కాబట్టి వారిని చుల‌కనగా చూస్తున్నారా..? అని ‘జూపూడి’ ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని రాబోయే ఎన్నికల్లో గానీ, తరువాత జరగబోయే ఎన్నికల్లో కానీ టిడిపి అధికారంలోకి వచ్చే ప్రసక్తేలేదని, అది తెలుసుకునే ఇప్పుడు తండ్రీకొడుకులు దళితజపం చేస్తున్నారని, ఇప్పటికైనా చీటింగ్‌ వ్యవహారాలు వాళ్లు మానుకోవాల‌ని ఆయన స్పష్టం చేశారు.

(197)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ