లేటెస్ట్

సీనియర్‌ ఐఎఎస్‌ ‘రవిచంద్ర’ బదిలీ

సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి ‘ముద్దాడ రవిచంద్ర’ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న ‘రవిచంద్ర’ను అక్కడ నుంచి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వుల‌ను జారీ చేసింది. ఆయనను వెంటనే జీఎడిలో రిపోర్టు చేయాల‌ని ఆదేశించింది. ఆయన నిర్వహిస్తున్న శాఖను పాఠశాల‌శాఖ ప్రిన్స‌పల్‌ కార్యదర్శిగా పనిచేస్తున్న ‘బుడితి రాజశేఖర్‌’కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ‘నీలం సహానీ’ ఉత్తర్వులు జారీ చేశారు. పనిచేసే అధికారిగా, క్రమశిక్షణకు మారు పేరుగా, నిజాయితీగా వ్యవహరిస్తారనే పేరున్న ‘ముద్దాడ రవిచంద్ర’ను ప్రభుత్వం అకస్మాత్తుగా ఎందుకు బదిలీ చేసిందో ఎవరికీ అర్థం కావడం లేదు. పేద విద్యార్థుల‌ ఉన్నతి కోసం, వారి వృధ్ది కోసం స్వంత సొమ్ముల‌ను ఖర్చు చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచిన ‘రవిచంద్ర’ ఆకస్మిక బదిలీ సచివాల‌య వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

(563)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ