లేటెస్ట్

2021లో రిటైర్‌ అయ్యే ఐఎఎస్‌ అధికారులు వీరే...!

రాష్ట్ర క్యాడర్‌లో పనిచేస్తున్న 13మంది ఐఎఎస్‌ అధికారులు వచ్చే ఏడాదిలో రిటైర్‌ కానున్నారు. రిటైర్‌ కానున్న వారి జాబితాను ప్రభుత్వం ఈ రోజు విడుదల‌ చేసింది. ఈ జాబితాలో పి.ఉషాకుమారి, బి.ఉదయల‌క్ష్మి, డి.మార్కెండేయులు, ఐ.శ్యామూల్‌ ఆనంద్‌కుమార్‌, కె.రామ్‌గోపాల్‌, ఆదిత్యనాథ్‌దాస్‌, బి.రామారావు, అభయ్‌త్రిపాఠీ, సమీర్‌శర్మ, సతీష్‌ చంద్ర, వి.ఉషారాణి, ఐ.శ్రీనివాస్‌ శ్రీ నరేష్‌, జె.ఎస్‌.వెంకటేశ్వర ప్రసాద్‌లు ఉన్నారు. వీరిలో పి.ఉషాకుమారి జనవరి నెల‌లో రిటైర్‌ కానుండగా, బి.ఉదయక్ష్మి మార్చిలోనూ, మార్కెండేయులు, ప్రస్తుత గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఐ.శ్యామూల్‌ ఆనంద్‌కుమార్‌లు మే నెల‌లో రిటైర్‌ కానున్నారు. కె.రామ్‌గోపాల్‌, ఆదిత్యనాథ్‌దాస్‌, బి.రామారావు జూన్‌ నెలాఖరుకు రిటైర్‌ కానుండగా, అభయ్‌త్రిపాఠీ జూలై నెల‌లో రిటైర్‌ అవుతారు. డి.సమీర్‌శర్మ, సతీష్‌చంద్ర, వి.ఉషారాణిలు నవంబర్ నెల‌లోనూ, ఐ.శ్రీనివాస్‌ శ్రీనరేష్‌, జె.ఎస్‌.వి. ప్రసాద్‌లు 2021 సంవత్సరపు చివరి రోజు పదవీ విరమణ చేయనున్నారు. కాగా..వీరిలో ఆదిత్యనాథ్‌దాస్‌, సతీష్‌చంద్రలు తమకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి దక్కుతుందని భావిస్తున్నారు. ప్రస్తుత సిఎస్ నీలం సహానీ పదవీకాలం పొడిగింపు పూర్తి అయిన  తరువాత వీరిద్దరిలో ఒకరికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి దక్కుతుందని సచివాల‌యంలో ప్రచారం జరుగుతోంది. వీరు కాకుండా ఢిల్లీలో పనిచేస్తోన్న మరో ఇద్దరు అధికారులు కూడా సిఎస్‌ పదవి కోసం పోటీపడుతున్నట్లు సమాచారం.

(426)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ