లేటెస్ట్

‘జగన్‌’ విషయంలో సిజెఐదే తుది నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిపై కోర్టు ధిక్కారం కేసు నమోదు చేయాల‌ని దానికి అనుమతి కోరుతూ బిజెపికి చెందిన న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ రాసిన లేఖపై అటార్నీ జనరల్‌ స్పందించారు. సుప్రీంకోర్టులో రెండో సీనియర్‌ న్యాయమూర్తి అయిన ‘ఎన్.వి.రమణ’పై ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు సీజేఐకు లేఖ రాశారు. ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని సిఎం జగన్‌పై చర్యలు తీసుకోవడానికి అటార్నీ జనరల్‌ అనుమతి ఇవ్వాల‌ని ‘అశ్వనీ’ లేఖ రాసిన విషయం విదితమే. అయితే దీనిపై అటార్నీజనరల్‌ స్పందిస్తూ సీజేఐకి సిఎం జగన్‌ లేఖ రాయడం కోర్టు ధిక్కారమేనని, సీజేఐకి రాసిన లేఖ బహిర్గతం చేయడం కోర్టు ధికార్కం కిందకే వస్తుందని పేర్కొన్నారు. ఈ విషయంలో సీజేఐనే నిర్ణయం తీసుకోవాల‌ని ఆయనకు అన్నీ తెలుసనని, ప్రత్యేకంగా కోర్టు ధిక్కారం కోసం తాను అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదని వేణుగోపాల్‌ అశ్వనీకుమార్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల‌కు సంబంధించి జస్టిస్‌ ఎన్వీ రమణ తీర్పు ఇచ్చిన తరువాత లేఖ రాయడం అనుమానాల‌కు దారి తీస్తుందని, ఇప్పటికే జగన్‌పై 31 కేసులు ఉన్నాయని లేఖలో అటార్నీ జనరల్‌ పేర్కొన్నారు. కాగా..ఈ విషయం సుప్రీంకోర్టు సీజెఐ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. 

(609)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ