WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పేకాట ఆడుతూ దొరికిన తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే...!

తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే వెంకట మధుసూదన్‌రావు అలియాస్ నాని(టిడిపి) పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయారు. హైదరాబాద్‌లో పేకాట ఆడుతున్న మాజీ ఎమ్మెల్యే నానితో పాటు మరో నలుగురిని సెంట్రల్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.5.70 లక్షల నగదు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నాని అతనితో పాటు మరో నలుగురు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న హోటల్‌ టూరిజం ప్లాజాలో బస చేశారు.రూం నంబర్‌ 508 లో మధుసూదన్‌తో పాటూ పలువురు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే సెంట్రల్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి వారిని పంజగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

(308)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ