సంయమనం పాటించండి...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సంయమనం పాటించండి...!

ఆలయాల తొలగింపు వ్యవహారంలో అందరూ సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. కూల్చివేసిన ఆలయాలను తిరిగి నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. రోడ్డు విస్తరణ, అభివృద్ధిలో భాగంగా ఆలయాలను తొలగించాల్సి వస్తే ఆలయ కమిటీలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. గోశాల తరలింపుకోసం ఇప్పటికే రూ. 40 లక్షలు ఇచ్చామని చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఎక్కడ ఎవరినీ ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వానికి లేదని అన్నారు. కూల్చి వేసిన గుళ్లను ఇప్పుడు ఉండేదానికంటే మెరుగ్గా తీర్చిదిద్దుతామని, ఎక్కడా ఎవరికీ అన్యాయం జరగదని ఆయన హామీ ఇచ్చారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా కాపాడతామని ఆయన అన్నారు. విజయవాడ దుర్గగుడి వద్ద పుష్కరఘాట్‌ పనులను పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈనెల 30 లోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఐదారు రోజుల్లో సచివాలయం భవనాలు సిద్ధమవుతాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. కార్పొరేట్‌ కార్యాలయాలకు దీటుగా సచివాలయం రూపు దిద్దుకుంటోందని చంద్రబాబు చెప్పారు.

(232)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ