WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చంద్రబాబు'కు నేనే మంత్రి పదవి ఇప్పించాను...!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తొలిసారిగా కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రి పదవి తానే ఇప్పించానని టిడిపి సీనియర్‌ నేత,మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ హయాంలో చంద్రబాబు తొలుత మంత్రి కావడానికి తాను ఢిల్లీలో పెద్దఎత్తున కృషి చేశానని, ఈ సంగతి ఆయనకీ తెలుసనని 'బలరాం' వ్యాఖ్యానించారు. అయితే ఇవన్నీ ఇప్పుడు చెప్పుకోవాల్సిన విషయాలు కాదని అన్నారు. ఎన్టీఆర్‌ అల్లుళ్ల‌యిన‌ చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు మధ్య విభేదాల వల్ల తాను చాలా నష్టపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రత్యర్థి గొట్టిపాటి హనుమంతరావుకు చంద్రబాబు 1999లో మంత్రి పదవి కట్టబెట్టారని ఇది తనకు ఆవేదన కల్గించిందని అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో వైకాపా అభ్యర్ధి విజయసాయిరెడ్డిని ఓడించేందుకు వైకాపా నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించామని మరో ఎనిమిది మంది చేరితే వైకాపా అభ్యర్థి గెలిచేవారు కాదని ఆయన చెప్పారు. టిడిపిలో చేరిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఒక పసిబాలుడు అని ఆయన గురించి తాను వ్యాఖ్యానించేదేమీ లేదని అన్నారు. చంద్రబాబు పార్టీలో డ్యాన్స్‌ మాస్టర్లను పెట్టుకుంటే లాభం లేదని, తనకు ఆర్టీసీ ఛైర్మన్‌ పదవి ఇస్తామని చంద్రబాబే చెప్పారని ఇంత వరకూ దాని సంగతి చూడలేదని ఆయన చురకలు అంటించారు.

(577)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ