'బీసీసీఐ'ది గొప్ప నిర్ణయం...!

టీమిండియా క్రికెట్ కోచ్‌గా 'అనిల్‌కుంబ్లే'ని ఎంపిక చేసి బీసీసీఐ గొప్ప నిర్ణయం తీసుకుందని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఆటగాడు గ్లెన్మెగ్ గ్రాత్ ప్రశంసల జల్లు కురిపించారు. తన దృష్టిలో కోచ్ బ్యాట్స్‌మెన్, బౌలర్ అనే తేడా ఉండదని చెబుతూనే బౌలర్లు అయితేనే కాస్త బెటర్ అని గ్రాత్ అభిప్రాయపడ్డారు. ఓ పోరాట యోధుడికి, మంచి వ్యక్తికి కోచ్ పగ్గాలు అప్పగించడం భారత్ కు మరింత మేలు చేస్తుందన్నాడు.గత నెల 23న సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, బీసీసీఐ సభ్యులు కోచ్ గా కుంబ్లేను ఎంపిక చేయడం, ఆ నిర్ణయంపై మాజీ ఆటగాడు, టీమిండియాకు డైరెక్టర్ గా సేవలందించిన రవిశాస్త్రి అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బౌలర్‌గా భారత్ కు విశిష్ట సేవలు అందజేసిన కుంబ్లే, కోచ్ గా కూడా మరింత ముందుకు సాగుతాడని మెక్ గ్రాత్ అన్నాడు.