WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వాళ్లను నేను కొట్టలేదు...!

ఇండియా క్రికెట్‌ ఆటగాళ్లు 'హర్భజన్‌సింగ్‌, యువరాజ్‌సింగ్‌లను తాను కొట్టినట్లు వస్తోన్న వార్తలు అసత్యమని పాకిస్తాన్‌ క్రికెటర్‌ 'షోయబ్‌ అక్తర్‌' వివరణ ఇచ్చారు. భారత టీవీల్లో త్వరలో టెలికాస్ట్‌ కానున్న 'ఆప్‌ కి అదాలత్‌' అనే కార్యక్రమానికి సంబంధించి తయారు చేసిన వీడియోలో హర్భజన్‌ తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. అందులో భాగంగానే ఒకసారి తననూ, యువరాజ్‌ను అక్తర్‌ కొట్టాడని నవ్వుతూ చెప్పాడు. అయితే ఈ వ్యాఖ్యలు పాక్‌ మీడియాలో బాగా ప్రచారం పొందాయి. దీంతో అక్తర్‌తో పాటుగా, పాక్‌ మాజీ కెప్టెన్‌ ఇంజిమామ్‌ ఉల్‌ హక్‌ కూడా స్పందించాడు. అక్తర్‌ మాట్లాడుతూ.. అవును నిజమే ఆ సంఘటన 2004లో రావల్పిండిలో జరిగిందని చెప్పాడు. అయితే తాను సరదాగా ఆట పట్టించానని, అంతా సరదాగా జరిగిన విషయమేనని కానీ దీన్ని హర్భజన్‌ కొద్దిగా మార్చి చెప్పాడని క్లారిటీ ఇచ్చాడు.

(345)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ