లేటెస్ట్

'రామకృష్ణారెడ్డి' పోరాటం టిడిపి నేతలకు ఆదర్శం...!

అధికారం ఉన్నప్పుడు తమంత వీరులు లేరని రెచ్చిపోయిన కొంత మంది టిడిపి నేతలు ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత ఎక్కడ ఉన్నారో తెలియకుండా మాయమయ్యారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వీరి ఉనికే కనిపించడం లేదు. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా..వీరు మాత్రం ఇళ్ల నుంచి, హైదరాబాద్‌, బెంగుళూరు, విదేశాల నుంచి నియోజకవర్గాలకు చేరుకోవడం లేదు. ప్రతిపక్షపార్టీగా ప్రజా సమస్యలపై పోరాడాల్సిన కొంత మంది నేతలు తూ తూ మంత్రంగా వ్యవహరిస్తున్నారు. అధికారపక్షం చేస్తోన్న అన్యాయాలను, అక్రమాలను ప్రజల్లోకి తీసుకువచ్చి పోరాటాలు చేయాల్సిన నేతలు తమకెందుకులే అన్నట్లు, బయటకు వస్తే కేసులు పెడతారేమో, జైలుకు పంపుతారేమో అన్న భయంతో కార్యకర్తలకు, ప్రజలకు దొరక్కుండా తప్పించుకుంటున్నారు. అలా తప్పించుకు తిరుగుతున్న నేతలకు విరుద్ధంగా కొందరు మాత్రం తెగించి పోరాడుతున్నారు. అటువంటి కోవలోకే వస్తారు అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి. ప్రతిపక్ష ఎమ్మెల్యే చేస్తోన్న తప్పులను ఎత్తి చూపుతూ ఆయన చేస్తోన్న పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

అనపర్తి ప్రస్తుత ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి వల్ల వైకాపా పార్టీకే చెందిన మహిళ 'కర్రి అరుణకుమారి' మృతిపై 'రామకృష్ణారెడ్డి' ఉధృతమైన పోరాటం చేశారు. 'అరుణకుమారి' ఇంటికి దారి లేకుండా చేయడంతో ఆమె మనస్థాపంతో మృతి చెందిన విషయాన్ని 'రామకృష్ణారెడ్డి' వెలుగులోకి తెచ్చారు. స్వంత పార్టీకి చెందిన వారు కూడా వైకాపా ఎమ్మెల్యే వల్ల ఇబ్బందులు పడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొందని, రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆయన వెలుగులోకి తెచ్చారు. ఆమె ఆత్మహత్యపై ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని లేకుండా ఆమరణ దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు.  అంతే కాకుండా నియోజకవర్గంలో మైనింగ్‌, ఇతర వ్యవహారాల్లో ఎమ్మెల్యే 'సత్తి సూర్యనారాయణరెడ్డి' అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సహజంగా 'సత్తి సూర్యనారాయణరెడ్డి'కి నిజాయితీపరుడిగా పేరుందని, కానీ ఆయన కూడా ఎవరూ ఊహించనంత అవినీతికి పాల్పడుతున్నారని 'రామకృష్ణారెడ్డి' ఆధారాలతో ఆరోపణలు చేశారు. దీనికి ఎమ్మెల్యే ప్రతిస్పందించి బిక్కవోలులోని లక్ష్మీగణపతి ఆలయంలో సత్యప్రమాణం చేద్దామని సవాల్‌ చేశారు. దీనికి 'రామకృష్ణారెడ్డి' సై అనడంతో ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. కేవలం సవాళ్లకే పరిమితం కాకుండా లక్ష్మీగణపతి ఆలయంలో భార్యతో సహా కలసి ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారని 'రామకృష్ణారెడ్డి' ఆరోపించారు. దీనికి ఎమ్మెల్యే ప్రతి ఆరోపణలు చేశారు. సవాళ్లు, ప్రతిసవాళ్లు ఎలా ఉన్నా నియోజకవర్గంలో అధికార ఎమ్మెల్యేపై మడమ తిప్పకుండా పోరాడుతున్న 'రామకృష్ణారెడ్డి'ని టిడిపి నేతలు ఆదర్శంగా తీసుకోవాలని టిడిపికి చెందిన ఓ సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు. రామకృష్ణారెడ్డి పనితీరుపై ఇప్పటికే 'చంద్రబాబునాయుడు' ప్రశంసలు కురిపించగా, రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి కార్యకర్తలు, నాయకుల నుంచి 'రామకృష్ణారెడ్డి'కి ప్రశంసలు లభిస్తున్నాయి. ఆయన తీరును మిగితా టిడిపి నేతలు ఆదర్శంగా తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు. 

(847)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ