లేటెస్ట్

నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ చేసిన కృష్ణ చైతన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్

మరుపూడి కృష్ణ చైతన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్  ఆధ్యర్యంలో పేద విద్యార్థులకు  మంగళ వారం రోజున స్కాలర్ షిప్ పంపిణి చేసారు. కలర్స్ డిజిటల్ ప్రెస్  నారాయణగూడ  నందు మంగళవారం జరిగిన కార్యక్రమంలో కలర్స్ డిజిటల్ ప్రెస్అధినేత కృష్ణ చైతన్య జ్ఞాపకార్థం, ఆయన సోదరుడు వంశీ మారుపూడి పోటో విడియో రంగలో ఉన్న నిరు పేద ఫోటోగ్రాఫర్స్ కుంటుంబాలలోని విద్యార్థులకు ఫీజుల రూపంలో 3 లక్షలు రూపాయాలు ఆర్థికసాయం అందజేయసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది నిరుపేద యువతీ యువకులు ఆర్థిక ఇబ్బందుల వలన వారు కన్న కలలను నెరవేర్చుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు చదువుతోపాటు స్వయం ఉపాధికి తోడ్పాటు అందిస్తే వారు అద్భుతాలు సృష్టించగలరని తెలిపారు. మా సోదరుడు కృష్ణ చైతన్య జ్ఞాపకార్థం నిరుపేద ఫోటోగ్రఫర్స్ కుటుంబంలోని విద్యార్థులకు మాకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వెంకట రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రవీందర్, జగదీశ్, ఫోటోటెక్ అధినేత అభిమన్యు తదితరులు పాల్గొన్నారు.

(1476)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ