లేటెస్ట్

దోచుకుంటున్న అక్రమ మద్యం వ్యాపారులు

మద్యం ప్రియుల బలహీనతను ఆసరా చేసుకుని కొందరు వ్యాపారులు  దోచుకుంటున్నారు. సహజంగా ఏ వ్యాపారం చేసినా నూటికి పది రూపాయలు ఆదాయంగా తీసుకుని వ్యాపారం కొనసాగిస్తారు. అయితే అక్రమ మద్యం వ్యాపారులు అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తూ అధిక మొత్తములో లాభార్జనే ధ్యేయంగా నూటికి 25 రూపాయలు ఆదాయం చూసుకొని అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నారు. వివరాల్లోకి వెళితే కడప జిల్లా దువ్వూరు మండలం లోని మదిరేపల్లె గ్రామంలో మద్యం విక్రయదుకాణం లేకపోవడంతో అక్కడ మద్యం ప్రియులు ఎక్కువగా ఉండటంతో కొందరు వ్యాపారులకు వరంగా మారింది. దువ్వూరు లోని ప్రభుత్వ దుకాణంలో రెండు వందల రూపాయలతో కొనుగోలు చేసిన మద్యం బాటిల్ 250 రూపాయల చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కేవలం ఇదే వ్యాపారంతో పదిమంది విలాసవంతమైన జీవితం కోసం పాటుపడుతున్నారు. గతంలో ఇదే గ్రామంలో కొంతమంది పై ప్రభుత్వ అధికారులు దాడులు జరిపినప్పటికీ మరి కొందరు ఈ వ్యాపారం చేస్తూనే ఉన్నారు. గ్రామంలో మద్యం విచ్చలవిడిగా దొరకడం వలన మద్యం ప్రియులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. మద్యనిషేధాన్ని ప్రభుత్వం అమలు పరచడంలో ఇలాంటి వ్యాపారుల వలన కష్ట సాధ్యమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి అక్రమ మద్యం వ్యాపారాన్ని అరికట్టాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.

(95)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ