ఐఎఎస్ ప్రవీణ్‌కుమార్‌కు షాక్ ఇచ్చిన హైకోర్టు

మిషన్‌బిల్డ్ అధికారి ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రిక్విజల్ పిటీషన్‌పై హైకోర్టు నేడు తీర్పును వెలువరించింది. మిషన్‌బిల్డ్ ఏపీ కేసులో ఆయన కోర్టుకు తప్పుడు అఫడవిట్ సమర్పించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టు ధిక్కారం అభియోగాల కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. క్రిమినల్ ప్రాసిక్యూషన్ కింద కేసు దాఖలు చేయాలని రిజిస్ట్రార్ జ్యుడిషియల్‌కు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించింది. ప్రభుత్వం న్యాయ ప్రక్రియలో జోక్యంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని హైకోర్టు వ్యాఖ్యానించింది.మిషన్బిల్డ్ఎపి పథకంలో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల విక్రయించేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేసింది. దీనిపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు.