లేటెస్ట్

సిఎం 'జగన్‌' లేఖపై ఏం చేద్దాం...!

'జస్టిస్‌ రమణ' అభిప్రాయాన్ని అడిగిన సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ బాబ్డే

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తి 'జస్టిస్‌ రమణ' ప్రభావితం చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు వచ్చేలా చేస్తున్నారని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు పదే పదే అడ్డు వస్తున్నారని, ప్రభుత్వాన్ని అస్థిరపరిచి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మేలు చేసేలా వ్యవహరిస్తున్నారని  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి లేఖ రాశారు. అప్పట్లో ఆ లేఖ న్యాయవ్యవస్థలో సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి జగన్‌ చర్య కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పలువురు న్యాయవాదులు, సంఘాలు సుప్రీంకోర్టును కోరాయి. అయితే దానిపై ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవాలని సుప్రీం రిజస్టార్‌ వారికి తెలిపారు. కాగా ప్రస్తుతం దీనిపై ఆసక్తికరమైన కథనాన్ని 'ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌' ఆంగ్లదినపత్రిక ఇచ్చింది. 'జగన్‌' లేఖపై ఏమి చేయాలో తెలియజేయాలని న్యాయమూర్తి 'రమణ'ను సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌ బాబ్డే అడిగారని 'ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌' తన కథనంలో పేర్కొంది. చీఫ్‌ జస్టిస్‌ బాబ్డే తరువాత ప్రధాన న్యాయమూర్తి అవుతారని భావిస్తున్న 'జస్టిస్‌ రమణ' అభిప్రాయాన్ని ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి బాబ్డే అడగడం ఆసక్తిని కలిగించేదే. 

హైకోర్టును సుప్రీంకోర్టు న్యాయమూర్తి 'రమణ' ప్రభావితం చేస్తున్నారని సిఎం లేఖ రాయడం, అనంతరం దాన్ని బయటకు విడుదల చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జె.కె.మహేశ్వరిని సుప్రీంకోర్టు కోలీజియం సిఫార్సుతో బదిలీ చేశారు. కాగా ప్రస్తుతం 'జగన్‌' లేఖపై చర్య తీసుకునే ముందు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి తన సహచర న్యాయమూర్తులతో చర్చిస్తున్నారని ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. 'జగన్‌'పై ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూలషకంగా వారితో ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. మరో వైపు బదిలీపై వెళుతున్న జస్టిస్‌ మహేశ్వరి తనపై 'జగన్‌' చేసిన ఆరోపణలపై సుధీర్ఘమైన వివరణకు సిజెఐకు ఇచ్చినట్లు తెలుస్తోంది.  

ఈ ఏడాది సెప్టెంబర్‌లో 'అమరావతి' ల్యాండ్‌ స్కామ్‌పై సిట్‌ ఇచ్చిన నివేదికపై సింగిల్‌ బెంచ్‌కు నేతృత్వం వహించిన సిజె జస్టిస్‌ మహేశ్వరి దానిపై స్టే ఇచ్చారు. ఈ భూ కుంభకోణంలో మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌తో పాటు సుప్రీం న్యాయమూర్తి జస్టిస్‌ రమణ కుమార్తెలు ఉన్నారని సిట్‌ తన నివేదికలో పేర్కొంది. దీనిపై జస్టిస్‌ మహేశ్వరి స్టే ఇవ్వడంతో పాటు దాన్ని మీడియాలో ఎక్కడా ప్రచురించవద్దని, గ్యాగ్‌ ఆర్డర్‌ ఇచ్చింది. ఇటీవల ఈ గ్యాగ్‌ ఆర్డర్‌ను సుప్రీం ఎత్తివేసింది. 

అక్టోబర్‌10న ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్‌కల్లం మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్ర హైకోర్టు వ్యవహరిస్తున్న తీరు, సుప్రీం న్యాయమూర్తి 'రమణ' దాన్ని ప్రభావితం చేస్తున్న తీరుపై ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారని వెల్లడించారు. దీనిపై చాలా బార్‌ అసోషియేన్స్‌ 'జగన్‌' లేఖను బహిర్గతం చేయడాన్ని ఖండించాయి. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెండ్‌ దుష్యంత్‌ దవే 'జగన్‌'పై చర్య తీసుకోవాలని అటార్నీ జనరల్‌ కోరారు. దీనిపై సిజెఐనే నిర్ణయం తీసుకోవాలని అటార్నీ జనరల్‌ వారికి రాసిన లేఖలో తెలిపారు. ఇది ఇలా ఉంటే రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి రాకేష్‌ కుమార్‌ ఓ తీర్పు ఇస్తూ సుప్రీంకోర్టు కోలీజియంను ప్రభావితం చేస్తున్నారని, హైకోర్టు న్యాయమూర్తులు సిజె మహేశ్వరి మరియు సిజె ఆర్‌ఎస్‌ చౌహాన్‌ బదిలీలపై సందేహాలు వ్యక్తం చేశారు. అమరావతి కేసు విచారణలో ఉండగా ప్రధాన న్యాయమూర్తిని బదిలీ చేస్తే అది 'జగన్‌'కు లబ్ది చేకూర్చినట్లేనని, అదే సమయంలో ఆయనపై ఉన్న క్రిమినల్‌ కేసులు, ఇతర కేసులను ప్రస్తావించారు.  మొత్తం మీద న్యాయవ్యవస్థ ఏ రీతిన పనిచేస్తుందో అనే దానిపై 'రాకేష్‌కుమార్‌' పలు సందేహాలు వ్యక్తం చేశారు. కాగా..ఇప్పుడు 'జగన్‌' లేఖపై ప్రధాన న్యాయమూర్తి 'జస్టిస్‌ రమణ' అభిప్రాయాన్ని అడగడం ఆసక్తిని కల్గిస్తోంది. మొత్తం మీద ఏప్రిల్‌ 24లోపు దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారా..? లేక పోతే పెండింగ్‌లో పెడతారా...? ఒకవేళ పెండింగ్‌లో పెడితే తరువాత పటువంటి పరిస్థితులు నెలకొంటాయనే దానిపై కూడా న్యాయవ్యవస్థలో, ఆంధ్రా రాజకీయవర్గాల్లోనూ ఉత్కంఠత నెలకొంది.

(613)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ