లేటెస్ట్

బిజెపి మంత్రి ఉన్నప్పుడే ఎక్కువ గుళ్లు కూలాయి...!

రాష్ట్రంలో ఇప్పుడు హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు రాజకీయంగా ప్రకనంపనలు సృష్టిస్తున్నాయి. రోజూ ఎక్కడోచోట హిందూదేవాలయాలపై దాడులు, హిందూ దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం జరుగుతున్నాయి. దీనిపై అధికార ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. హిందూమతాన్ని ఉద్దరిస్తామని చెబుతున్న 'బిజెపి' దీనికి ప్రతిపక్ష టిడిపి, అధికార వైకాపాలే కారణమని చెబుతున్నాయి. ఆశ్చర్యకరంగా అధికారంలో ఉన్న వైకాపాను ఏమీ అనకుండా హిందూదేవాలయాలపై దాడులకు ప్రతిపక్ష టిడిపినే కారణమన్నట్లుగా ప్రకటనలు గుప్పిస్తున్నాయి. నిన్న హిందూదేవాలయాలపై దాడులకు సంబంధించి బిజెపి నేత 'విష్ణువర్థన్‌రెడ్డి' ట్వీట్‌ చేస్తూ టిడిపి హయాంలో 40 ఆలయాలను కూల్చారని విమర్శించారు. అయితే నాటి టిడిపి/బిజెపి ఉమ్మడి ప్రభుత్వంలో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేసింది బిజెపికి చెందిన మాణిక్యలరావు. ఆ విషయం గుర్తించకుండా టిడిపి హయాంలోనే ఎక్కువ ఆలయాలను కూల్చారని 'విష్ణువర్థన్‌రెడ్డి' విమర్శిస్తూ..ప్రస్తుతం కూలుస్తున్న ఆలయాల విషయం చిన్నదిగా చెప్పదలచుకున్నారు. నాడు 'విజయవాడ'లో రహదారి విస్తరణ సందర్భంగా కొన్ని హిందూ ఆలయాలను తొలగించారు. అదీ బిజెపి ఘనంగా చెప్పుకుంటున్న 'విజయవాడ కనకదుర్గ ప్లైఓవర్‌' కోసం. ప్లైఓవర్‌ ఘనత మాత్రం బిజెపిదట...ఆలయాల తొలగింపు అపచారం మాత్రం టిడిపిదట. ప్లైఓవర్‌ కోసం టిడిపి ఆలయాలను నాడు తొలగిస్తుంటే అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మాణిక్యాలరావు చేత బిజెపి ఎందుకు రాజీనామా చేయించలేకపోయింది..? ప్లైఓవర్‌ కన్నా తమకు ఆలయాలే ముఖ్యమనుకుని నాడు ఆయన చేత బిజెపి రాజీనామా చేయించుంటే నేడు 'విష్ణువర్థన్‌రెడ్డి' చేసిన వ్యాఖ్యలకు నైతిక ఉండేది. ప్రస్తుత హిందూ ధార్మిక సంస్థలపైన, ఆలయాలపైన, దేవతామూర్తుల విగ్రహాలను యుద్ధప్రాతిపదికన ధ్వంసం చేస్తున్న విషయంలో అధికారపార్టీని వెనుకేసుకురాబోయి గతాన్ని మరుస్తున్నట్లు కనిపిస్తోంది. 

(209)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ