లేటెస్ట్

సుప్రీంకోర్టు మొద‌టి మ‌హిళా సిజెఐగా జ‌స్టిస్ ‘బివి నాగ‌ర‌త్న‌’...!

జ‌స్టిస్ ‘బివి నాగ‌ర‌త్న’ భార‌త‌దేశ‌పు మొద‌టి మ‌హిళా ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా నియ‌మూర్తి కానున్నారు. సుప్రీంకోర్టులో న్యాయ‌మూర్తుల‌ను నియ‌మించ‌డానికి సుప్రీంకోర్టు తొమ్మిది మంది న్యాయ‌మూర్తుల పేర్ల‌ను కేంద్రానికి సిఫార్సు చేసింది. వీరిలో ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క హైకోర్టులో న్యాయ‌మూర్తిగా ప‌నిచేస్తోన్న జ‌స్టిస్ నాగ‌ర‌త్న కూడా ఉన్నారు. ప్ర‌స్తుతం సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుల ప్ర‌కారం జ‌స్టిస్ నాగ‌ర‌త్న 2027లో భార‌త‌దేశ‌పు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి కానున్నారు. సుప్రీంకోర్టు చేసిన సిఫార్సుల‌ను కేంద్రం ఆమోదించాల్సి ఉంది. ప్ర‌స్తుత భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్ ఎన్.వి.ర‌మ‌ణ కొలీజియంకు నేతృత్వం వ‌హించారు. తొమ్మిది మంది న్యాయమూర్తుల పేర్లను కేంద్రానికి సిఫారసు చేయడం ద్వారా కొలీజియం దాదాపు రెండు సంవత్సరాల సుదీర్ఘ లాగ్‌జామ్‌ను ముగించినట్లు భావిస్తున్నారు. ఐదుగురు సభ్యుల కొలీజియం, జస్టిస్ యుయు లలిత్, ఎఎమ్ ఖాన్విల్కర్, డివై చంద్రచూడ్ మరియు ఎల్ నాగేశ్వరరావు, ముగ్గురు మహిళా న్యాయమూర్తుల పేర్లను పంపారు, కర్ణాటక హైకోర్టు నుండి జస్టిస్ బివి నాగరత్నాతో సహా మొదటి మహిళా సిజెఐగా నియామ‌కం జ‌ర‌గ‌వ‌చ్చు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ