హత్య కేసులో నిందితుల అరెస్ట్
ఆళ్ళగడ్డ: ఆళ్ళగడ్డ పట్టణంలోని పుల్లారెడ్డి వీధిలో ఈనెల ఒకటో తారీఖున షేక్ హుస్సేన్ బి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్టు సీఐ ఆర్.జి. సుబ్రహ్మణ్యం ఎస్ఐ పి. రామిరెడ్డిలు తెలిపారు . పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం వారు మాట్లాడుతూ షేక్ హుస్సేన్ బి హత్య కేసు దర్యాప్తులో నిందితులైన అచ్చుకట్ల అక్బర్, మరియు బండి రమణమ్మ లను ఆళ్లగడ్డ వద్ద బైపాస్ దగ్గరనున్న పీవీఎస్ ఆర్ గోడౌన్ వద్ద అరెస్టు చేసినట్టు వారు వివరించారు. అలాగే 15,000 రూపాయల నగదు తో పాటు 7 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకొని నిందితులను ఆళ్ళగడ్డ కోర్టు నందు హాజరుపరిచినట్లు తెలిపారు.