లేటెస్ట్

సిఎం జగన్‌కు ఈడీ కోర్టు సమన్లు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల కేసులో ముఖ్యమంత్రి జగన్‌కు ఈడీ కోర్టు ఈనెల11న తమ మందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్‌ బదిలీ అయింది. ఈ కేసును విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు ఈ కేసులో నిందితులుగా ఉన్న 'జగన్మోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు 'విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, అరబిందో ఎండి నిత్యానందరెడ్డి, పీవీ రాంప్రసాద్‌రెడ్డి, టైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్‌ బీపీ ఆచార్యకు ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. 

(389)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ