లేటెస్ట్

రిటైర్డ్‌ జస్టిస్‌ ఈశ్వరయ్యకు సుప్రీంలో చుక్కెదురు

విశ్రాంత న్యాయమూర్తి ఈశ్వరయ్యకు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. న్యాయమూర్తులపై చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చేస్తోన్న విచారణపై స్టే ఇవ్వాలని జస్టిస్‌ ఈశ్వరయ్య సుప్రీంలో పిటీషన్‌ వేశారు. ఈ రోజు దీనిపై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. జడ్జి రామకృష్ణతో మాట్లాడిన మాట నిజమే అని అంగీకరించిన రిటైర్డ్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య తరుపున న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌. ఫోన్‌ సంబాషణలపై అఫడవిట్‌ దాఖలు చేయాలని ప్రశాంత్‌ భూషణ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇద్దరు వ్యక్తుల ప్రైవేట్‌ సంబాషణలపై విచారణ అవసరం లేదని ప్రశాంత్‌ భూషణ్‌ వాదించారు. కాగా రిటైర్డ్‌ జడ్జి ఈశ్వరయ్య చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా పరిగణించాలని కపిల్‌ సిబల్‌ వాదించారు. ఈ కేసును వచ్చే సోమవారం మళ్లీ విచారిస్తామని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌తో కూడిన ధర్మానసనం తెలిపింది.

(177)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ