లేటెస్ట్

ల్యాప్‌టాప్‌లు ఇస్తాం:సిఎం జగన్‌

రాష్ట్రంలో 9 నుండి 12వ తరగతి చదివే విద్యార్థులకు 'అమ్మఒడి' డబ్బులు వద్దనుకుంటే ఆ స్థానంలో ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ రోజు అమ్మఒడి పథకం రెండో విడతను ప్రారంభిస్తూ ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. అమ్మఒడి డబ్బులు వద్దన్నవారికి ల్యాప్‌టాప్‌లు ఇస్తామని, ఇప్పటికే ఈ ల్యాప్‌టాప్‌ల కోసం వివిధ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని, మేలు రకమైన ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని, వీటికి మూడేళ్ల వారంటీ ఉంటుందన్నారు. ఇవి పాడైతే వారం రోజుల్లో రీప్లేస్‌ చేస్తామని తెలిపారు. వచ్చే మూడేళ్లల్లో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్‌ తీసుకువస్తామన్నారు. 

(315)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ