లేటెస్ట్

'ఆరా' సర్వేలో 'అంబటి'కి మొదటి ర్యాంక్‌

'బ్రహ్మనాయుడు'కు రెండో ర్యాంక్‌

గుంటూరు జిల్లాలో ప్రస్తుత శాసనసభ్యుల   పనితీరు ఎలా ఉంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎంత మంది గెలుస్తారనే దానిపై 'ఆరా' సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 'సత్తెనపల్లి' ఎమ్మెల్యే 'అంబటి రాంబాబు'కు మొదటి స్థానం లభించగా, వినుకొండ ఎమ్మెల్యే 'బొల్లా బ్రహ్మనాయుడు'కు రెండో స్థానం దక్కగా, బాపట్ల ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతికి మూడవ ర్యాంక్‌ లభించింది. ఎమ్మెల్యేల పనితీరు,విజయావకాశాలపై సర్వే నిర్వహించినట్లు 'ఆరా' సంస్థ తెలిపింది. దీని ఆధారంగా ఎమ్మెల్యే 'అంబటి' 67శాతం పనితీరుతో మొదటి ర్యాంక్‌ సాధించారు. ఆయనకు 78శాతం విజయావకాశాలు ఉన్నట్లు సర్వేలో తేలింది. అదే విధంగా వినుకొండ ఎమ్మెల్యే 'బొల్లా బ్రహ్మనాయుడు' 65శాతం పనితీరుతో 72శాతం విజయావకాశాలను కలిగి ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికి 68శాతం గెలుపు అవకాశాలు ఉన్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే 'ఆళ్ల రామకృష్ణారెడ్డి'కి 61శాతం, పెదకూరపాడు ఎమ్మెల్యే 'నంబూరి శంకరరావు'కు 64శాతం, మాచర్ల ఎమ్మెల్యే 'పిన్నెల్లి రామకృష్ణారెడ్డి'కి 69శాతం, పత్తిపాటు ఎమ్మెల్యే, రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరితకు 61శాతం, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి 67శాతం, పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్యకు 51శాతం, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు 56శాతం, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డికి 54శాతం గెలుపు అవకాశాలున్నట్లు సర్వే సంస్థ తెలిపింది. 

ప్రతిపక్షపార్టీ టిడిపికి చెందిన ఏకైక ఎమ్మెల్యే అనగాని సత్యప్రకాష్‌కు 51శాతం విజయావకాశాలు ఉన్నాయి. గుంటూరు దక్షిణ ఎమ్మెల్యే 'మద్దాలి గిరి'కి 41శాతం, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్‌ ముస్తాపాకు 55శాతం, వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జునకు 46శాతం, చిలకలూరి పేట ఎమ్మెల్యే విడుదల రజనీకి 31శాతం, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి 23శాతం విజయావకాశాలు ఉన్నట్లు 'ఆరా' సంస్థ ప్రకటించింది. రాజధాని ప్రాంతమైన అమరావతికి దగ్గరగా ఉన్న 'మంగళగిరి' ఎమ్మెల్యే 'రామకృష్ణారెడ్డి' 61శాతం గెలుపొందే అవకాశాలున్నట్లు తేలగా, అదే ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్న శ్రీదేవికి కేవలం 23శాతమే విజయావకాశాలు ఉన్నాయి సర్వే సంస్థ ప్రకటించడం విశేషం. ముగ్గురు మహిళా ఎమ్మెల్యేల్లో కేవలం హోంమంత్రి సుచరిత మాత్రమే గెలుపొందడానికి అవకాశం ఉందని, మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలకు గెలుపొందే అవకాశాలులేవని సర్వే సంస్థ తెల్చింది. ప్రస్తుత సర్వే ప్రకారం చూస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలు ఓడిపోయే అవకాశం ఉంది. 

(520)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ