WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆసక్తి రేకెత్తిస్తోన్న 'సెల్ఫీరాజా'...!

గత కొంతకాలంగా సరైన హిట్‌ కోసం ఎదురు చూస్తున్న అల్లరి నరేష్‌ మరోసారి తన అదృష్టాన్ని 'సెల్ఫీరాజా' రూపంలో పరీక్షించుకోబోతున్నారు. ఈ నెల15న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలకు మించి ప్రచారం జరుగుతోంది. పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్‌లతో రుజువు అయింది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ముఖ్యంగా ట్రైలర్‌ చివర్లో కమెడియన్‌ ప థ్వీ చెప్పే 'చెప్పను బ్రదర్‌' అన్న డైలాగ్‌, కొద్దిరోజుల క్రితం అల్లు అర్జున్‌ చేసిన ప్రసంగాన్ని గుర్తు చేస్తూ అదిరిపోయే రెస్పాన్స్‌ తెచ్చుకుంది. అల్లరి నరేష్‌ మార్క్‌ కామెడీ సినిమా అన్న విషయం ట్రైలర్‌ చూస్తే ఇట్టే అర్థమైపోతోంది. ఒక సెలీా పిచ్చి ఉన్న హీరోగా నరేష్‌ ఈ సినిమాలో కనిపించనున్నారు. గతంలో అల్లరినరేష్‌తో 'సిద్ధు ఫ్రం సికాకుళం' అనే సినిమా తీసిన దర్శకుడు జి. ఈశ్వర్‌ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.(277)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ