WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వైకాపాలోకి 'ఉండవల్లి'...!

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రాణస్నేహితుడు రాజమండ్రి మాజీ పంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వైకాపాలో చేరడానికి రంగం సిద్ధమైంది. వైకాపా అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని స్వయంగా 'ఉండవల్లి'ని కలిసి చర్చించనున్నారు. గతంలోనే 'ఉండవల్లి' వైకాపాలో చేరతారని ప్రచారం జరిగినా అది ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తోంది. దివంగత వై.ఎస్‌.కు 'ఉండవల్లి' సన్నిహితుడు. రాజశేఖర్‌రెడ్డి అండతోనే 'ఉండవల్లి' రాజకీయాల్లో రాణించారు. రాజశేఖర్‌రెడ్డి మరణం తరువాత ఆయన వై.ఎస్‌.జగన్‌తో విభేదించి కాంగ్రెస్‌లోనే కొనసాగారు. అయితే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. అప్పట్లో ఆయన వైకాపాలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ ఎన్నికలకు ముందు 'జగన్‌' 'ఉండవల్లి'ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో 'ఉండవల్లి' కూడా 'జగన్‌'పై ఆసక్తి చూపలేదు. అయితే అధికార టిడిపిపై అడపా దడపా విమర్శలు చేస్తూ 'ఉండవల్లి' వార్తల్లో నిలుస్తున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 'ఉండవల్లి'ని పార్టీలోకి ఆహ్వానించాలని 'జగన్‌' భావించారు. దీంతో ఆయన రాజమండ్రి పర్యటనను పెట్టుకుని 'ఉండవల్లి'ని ప్రత్యేకంగా కలుస్తున్నారు. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీని విడిచిపోవడం, కేసుల సమస్యలతో 'జగన్‌' ఒంటరి అయిపోయారు. తన తండ్రి సన్నిహితులందరినీ మళ్లీ తన వెంట తీసుకుని అధికార టిడిపిపై సమరభేరి మోగించాలని ఆయన భావిస్తున్నారట. 'ఉండవల్లి'తో మొదలు పెట్టి కెవిపి రామచంద్రరావు, పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి వంటి వై.ఎస్‌.సన్నిహితులను పార్టీలో చేర్చుకోవాలనేది 'జగన్‌' వ్యూహం. మొత్తం మీద 'జగన్‌' తాను చేసిన తప్పులను దిద్దుకుంటూ మళ్లీ పూర్వవైభవానికి బాటలు వేసుకుంటున్నారు. అయితే ఇది ఎంత వరకు ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి.

(280)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ