WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఓం నమో వేంకటేశాయ' ట్రైలర్‌ విడుదల...!



'అక్కినేని నాగార్జున, అనుష్క, ప్రగ్యాజైశ్వాల్‌'లు నటించిన 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం ట్రైలర్‌ను సోమవారం నాడు చిత్ర బృందం విడుదల చేసింది. ఆదివారం రాత్రి ఈ చిత్రం ఆడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. సాయికృప ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చారు. జగపతిబాబు, సౌరభ్‌, విమలా రామన్‌ తదితరులు చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 10న 'ఓం నమో వేంకటేశాయ' చిత్రాన్ని విడుదల చేయడానికి అన్ని నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

 
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ