లేటెస్ట్

‘కోస్తా’లో దుమ్మురేపుతోన్న ‘టిడిపి’...!

ప్రముఖ న్యూస్‌ యాంకర్‌ ‘రవిప్రకాష్‌’ నిర్వహిస్తోన్న ‘గేమ్‌ ఛేంజర్‌’లో ఈ రోజు ‘కోస్తాంధ్ర’లోని నాలుగు జిల్లాల ఎన్నికల అంచనాలను విడుదల చేశారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లను గెలుస్తుందో వారు నిర్వహించిన సర్వే ఫలితాలను వెల్లడిరచారు. ఆర్‌టివి సర్వే ప్రకారం ఈ నాలుగు జిల్లాలో 55 సీట్లు ఉంటే వాటిలో 40 సీట్లను ఎన్‌డిఏ కూటమి గెలుచుకుంటుందని ప్రకటించారు. అధికార వైకాపాకు కేవలం 15 సీట్లు మాత్రమే వస్తాయని సర్వే తెలియజేసింది. కూటమి గెలుచుకునే 40 సీట్లలో టిడిపి-37, జనసేన-2, బిజెపి-1 సీటును గెలుచుకుంటుందని సర్వే తెలియజేసింది. మొదటగా నెల్లూరు జిల్లాకు వస్తే ఈ జిల్లాలో మొత్తం 10 సీట్లు ఉంటే వీటిలో టిడిపి`5, వైకాపా`5 సీట్లను గెలుస్తాయని సర్వే తెలిపింది. దీనిలో నెల్లూరు రూరల్‌, నెల్లూరు సిటీ, కోవూరు, వెంకటగిరి, కావలి సీట్లను తెలుగుదేశం పార్టీ గెలవనుంది. అదే విధంగా ప్రకాశం జిల్లాలో మొత్తం 12 సీట్లు ఉంటే వీటిలో టిడిపి -10 సీట్లను గెలుచుకోనుంది. అధికార వైకాపాకు కేవలం 2 సీట్లు మాత్రమే వస్తాయని సర్వే తెలియచేసింది. ఆర్‌టివి సర్వే ప్రకారం అద్దంకి, పర్చూర్‌, చీరాల, కొండిపి, సంతనూతలపాడు, ఒంగోలు, కనిగిరి, మార్కాపురం, దర్శి,గిద్దలూరుల్లో టిడిపి గెలవనుంది. మిగిలిన రెండు నియోజకవర్గాల్లో వైకాపా గెలుపొందనుంది. రాజకీయచైతన్యం అధికంగా ఉండే ‘గుంటూరు’ జిల్లాలో ఈసారి టిడిపి దుమ్మురేపనుంది. ఈ సర్వే ప్రకారం ఇక్కడ టిడిపి కూటమి 15సీట్లను గెలుచుకోనుంది. మొత్తం 17స్థానాలు ఉండగా దీనిలో టిడిపి-14, జనసేన-1, వైకాపా-2 స్థానాలను దక్కించుకోనున్నాయి. మంగళగిరి, తాడికొండ, పత్తిపాడు, గుంటూరు వెస్ట్‌, గుంటూరు ఈస్ట్‌, పెదకూరపాడు, సత్తెనపల్లె, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, తెనాలి, పొన్నూరు,  వేమూరు, రేపల్లె,నర్సరావుపేటల్లో టిడిపి కూటమి గెలుపొందనుంది. అధికార వైకాపా బాపట్ల, వినుకొండల్లో గెలుపొందుతుందని సర్వే తెలియజేసింది. ఇక కృష్ణా జిల్లాలో మొత్తం 16 సీట్లు ఉంటే ఇక్కడ టిడిపి కూటమి 10సీట్లను గెలుచుకోనుంది. దీనిలో టిడిపి-8, జనసేన-1, బిజెపి-1 స్థానాన్ని గెలుపొందనుందని సర్వే స్పష్టం చేసింది. అధికార వైకాపా ఇక్కడ అనుకున్నదాని కన్నా మెరుగైన ఫలితాలను సాధించబోతోంది. ఇక్కడ ఆ పార్టీకి 6 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. సర్వే ప్రకారం టిడిపి కూటమి విజయవాడ ఈస్ట్‌, విజయవాడ సెంట్రల్‌, విజయవాడ వెస్ట్‌, మైలవరం, పెనమలూరు,జగ్గయ్యపేట, మచిలీపట్నం, అవనిగడ్డ, గన్నవరం, గుడివాడల్లో గెలుపొందనుంది. అధికార వైకాపా నందిగామ, పామర్రు, కైకలూరు, పెడన, నూజివీడు,తిరువూరుల్లో గెలవనుంది.

మొత్తం మీద నాలుగు జిల్లాల్లో 55 సీట్లు ఉంటే టిడిపి కూటమికి 40సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది. నిన్న రాయలసీమలో టిడిపికి 22 సీట్లు వస్తాయని ఇదే సంస్థ తెలియజేసింది. మొత్తం ఎనిమిది జిల్లాలో 62 సీట్లు టిడిపి కూటమిలో చేరాయి. మరో ఐదు జిల్లాల సర్వే ఫలితాలు రావాల్సి ఉంది. ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 88సీట్లు రావాల్సి ఉంది. ప్రస్తుతం టిడిపి కూటమి ఖాతాలో 62 సీట్లు ఉన్నాయి. మిగతా ఐదు జిల్లాలో  కూటమి 26 స్థానాలు సంపాదించగలిగితే..ఈ సర్వే ప్రకారం కూటమి అధికారంలోకి వస్తుంది. అదే విధంగా వైకాపా ఖాతాలో ఇప్పటి వరకూ 44 స్థానాలు ఉన్నాయి. ఆ పార్టీ అధికారంలోకి రావాలంటే ఐదు జిల్లాలో మరో 44 స్థానాలు సాధించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా..ఆర్‌టివి చేస్తోన్న సర్వేపై అధికారపార్టీ కత్తులు నూరుతోంది. తమను తక్కువగా చూపిస్తున్నారని, ‘రవిప్రకాష్‌’ కమ్మవాడని, అందుకే..ఆయన టిడిపి కూటమి గెలుస్తుందనే విధంగా సర్వేను విడుదల చేస్తున్నారని విమర్శలు చేస్తోంది. కాగా టిడిపి కూడా ఈ సర్వేను పూర్తిగా నమ్మడం లేదు. ప్రజాభిప్రాయం తమకు పూర్తిగా అనుకూలంగా ఉందని, తమకు 140 నుంచి 150 సీట్లు వస్తాయని, కానీ ‘రవిప్రకాష్‌’ వైకాపా దాడిని తట్టుకోలేక వాళ్లూ పోటీలో ఉన్నారన్నట్లుగా అంచనాలను విడుదల చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొత్తం మీద టివి9 మాజీ సీఇఓ వ్యాఖ్యాతగా విడుదలౌతున్న ఈ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ